ఒరాకిల్ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఒరాకిల్ కంపెనీ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కంపెనీలో ఖాళీగా ఉన్న మెంబ‌ర్ టెక్నిక‌ల్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ లేదా పీజీ లేదా త‌త్స‌మాన కోర్సులో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌డానికి అభ్య‌ర్థులు https://careers.oracle.com/jobs/#en/sites/jobsearch/job/259969?lastSelectedFacet=AttributeChar6&location=India&locationId=300000000106947&selectedFlexFieldsFacets=%22AttributeChar6%7C0+to+2%2B+years%22 అనే లింక్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది.

oracle company offering member technical jobs

ఈ ఉద్యోగాల‌కు ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు. కానీ 2 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇస్తారు. జావా, ఓఓ ప్రోగ్రామింగ్‌, అల్గారిథ‌మ్‌, డీబ‌గ్గింగ్‌, మైక్రో స‌ర్వీసెస్‌, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్కిల్స్‌, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చ‌ర్‌, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాల‌ను క‌లిగి ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now