ఉద్యోగాలు

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ (నాన్ కాంబాటెంట్‌) ఉద్యోగాల భ‌ర్తీకి ఇటీవ‌లే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు గాను ద‌ర‌ఖాస్తుల‌ను పంపించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 17 నుంచి 21 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఇంట‌ర్ లేదా డిప్లొమా లేదా 2 ఏళ్ల వొకేష‌న‌ల్ కోర్సును చ‌దివి ఉండాలి. ఎత్తు 152 సెంటీమీట‌ర్లు ఉండాలి. ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండాలి. 6 నిమిషాల 30 సెక‌న్ల‌లో 1.6 కిలోమీట‌ర్ల దూరం ప‌రుగెత్తాల్సి ఉంటుంది. 1 నిమిషంలో 10 పుష‌ప్స్ చేయాలి. 1 నిమిషంలో 10 సిట‌ప్స్ చేయాల్సి ఉంటుంది. 1 నిమిషంలో 20 స్క్వాట్స్ చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన ప‌నిలేదు. అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, స్ట్రీమ్ సూట‌బిలిటీ టెస్ట్‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు మొద‌టి ఏడాది నెల‌కు రూ.30వేలు, 2వ ఏడాది నెల‌కు రూ.33వేలు, 3వ ఏడాది నెల‌కు రూ.36,500 జీతం చెల్లిస్తారు. 4వ ఏడాది నుంచి నెల‌కు రూ.40వేల వేత‌నం ఇస్తారు. 4వ ఏడాది పూర్తి అయిన త‌రువాత సేవా నిధి ప్యాకేజీ కింద ఎలాంటి ప‌న్ను లేకుండా రూ.10.04 ల‌క్ష‌ల‌ను రివార్డు కింద అందిస్తారు.

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు త‌మ ధ్రువ‌ప‌త్రాలు, ఇత‌ర ప‌త్రాల‌ను రూ.10 స్టాంపు అతికించిన పోస్ట‌ల్ కార్డుతో స‌హా అప్లికేష‌న్ ఫామ్‌ను పంపించాల్సి ఉంటుంది. అప్లికేష‌న్ ఫామ్, ఇత‌ర వివ‌రాల కోసం అభ్య‌ర్థులు https://agnipathvayu.cdac.in/AV/img/non-combatant/02-2025/Information_Brochure_Agniveervayu_Non-Combatants_02_2025.pdf అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM