జీవితం ఎప్పుడూ మన ముందు రెండు రకాల చాయిస్‌లను ఉంచుతుంది. ఇప్పుడు ఉన్న దుస్థితిని అనుభవిస్తూ దాన్నే తలచుకుంటూ కుమిలిపోతూ జీవితాన్ని అనుభవించడం. లేదా ఉన్న దుస్థితిని సవాల్ చేస్తూ కష్టాలను దీటుగా ఎదుర్కొంటూ, సవాళ్లను స్వీకరిస్తూ కష్టపడి జీవితంలో ముందుకు సాగడం, ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడం. ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికీ రెండు చాయిస్ లు ఉంటాయి.
కానీ కొందరు మాత్రమే రెండో చాయిస్‌ను ఎంచుకుంటారు. కష్టాలకు ఎదురొడ్డి ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సమాజం ఎంత హేళన చేసినా సరే కుంగిపోకుండా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తారు. అవును.. ఆ మహిళ కూడా సరిగ్గా ఇలాగే చేసింది.
ఆమె పేరు హిమానీ బుందెల. ఇటీవలే కౌన్ బనేగా క్రోర్‌పతిలో రూ.1 కోటి గెలుచుకుంది. కానీ అదంత సులభంగా రాలేదు. ఆమె ఒక టీచర్. 2011లో ఆమె అనుకోని ప్రమాదంలో తన కంటి చూపును కోల్పోయింది. డాక్టర్లు అనేక సార్లు ఆపరేషన్లు చేశారు. అయినప్పటికీ ఆమెకు కంటి చూపును తెప్పించలేకపోయారు.
అయితే తన పరిస్థితిని తలచుకుని ఆమె బాధపడలేదు. కష్టాలను అధిగమించింది. ఎవరెన్ని హేళనలు చేసినా ధైర్యంగా ముందుకు సాగింది. టీచర్‌గా రాణిస్తోంది. తాను చదువు చెప్పే పిల్లలు కూడా తనలాగే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందుకు సాగాలని చెబుతుంటుంది. ఇక ఆమె కేబీసీలో గెలుచుకున్న రూ.1 కోటితో తనలాంటి వాళ్లకు సహాయం చేయడం కోసం ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ను ఆమె ప్రారంభించనుంది. ఆమె చేస్తున్న పనికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…