Women Health : మహిళలూ.. ఖచ్చితంగా ఈ 5 పోషకాలని రోజూ తీసుకోండి.. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి..!

October 1, 2023 9:58 AM

Women Health : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వయసు పెరిగే కొద్దీ, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు, కచ్చితంగా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మహిళల ఒంట్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో తీసుకుంటూ ఉండాలి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, జింక్, ఐరన్ ఇలా అనేక రకాల పోషకాలు అందేలా, మహిళలు వాళ్ళ డైట్ ని తీసుకుంటూ ఉండాలి.

ఇలా పోషకాహారాన్ని బాగా తీసుకున్నట్లయితే, ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సెంటర్ డిసీస్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం, ఫాలిక్ యాసిడ్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. ఫాలిక్ యాసిడ్ వుండే, ఆహార పదార్థాలని బాగా తీసుకోండి. అదేవిధంగా, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోండి. మహిళలు ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అలానే, విటమిన్ డి ఎక్కువగా ఉండే పోషక పదార్థాలు కూడా తీసుకుంటూ ఉండండి.

Women Health 5 nutrients for them to take daily
Women Health

విటమిన్ డి ఉండేవి తీసుకుంటే, ఎముకల సమస్యలు ఉండవు. విటమిన్ డి లోపం ఉంటే, ఎముకల బలహీనత, ఎముకల సమస్యలు వంటివి కలుగుతుంటాయి. కాబట్టి, కచ్చితంగా ఎముకలు ఆరోగ్యం కోసం దంతాల ఆరోగ్యం కోసం విటమిన్ డి ఉండేటట్టు చూసుకోండి. అలానే, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అన్నీ పొందితే, రోగినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్ ఈ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే, గర్భిణీలకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చు. కొలైన్ ఎక్కువగా ఉండే వాటిని కూడా తీసుకోండి. లివర్, బ్రెయిన్ ఫంక్షన్ కి ఇది చాలా అవసరం. ఇలా. ఈ పోషక పదార్థాలు అన్నిటిని మీరు డైట్ లో తీసుకున్నట్లయితే, ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment