Banana : అరటి పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లను తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవన్నీ మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక మీడియం సైజ్ ఉన్న అరటి పండును తిన్నా చాలు.. మనకు 110 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందువల్ల అరటి పండ్లను తింటే లావుగా అయిపోతామేమోనని అందరూ భయపడుతుంటారు. నిజానికి ఈ విషయం కరెక్టే అయినప్పటికీ లావుగా ఉన్న వారు కూడా అరటి పండును నిర్భయంగా తినవచ్చు. అందువల్ల బరువు ఏమీ పెరగరు. కాకపోతే అందుకు ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే..
లావుగా ఉన్నవారు రోజుకు ఒక మీడియం సైజ్ అరటి పండును తినవచ్చు. చిన్నవి అయితే రెండు తినవచ్చు. ఇక ఇలా అరటి పండ్లను తింటే ఇతర ఆహారాలను పూర్తిగా మానేయాలి. లేదా రోజూ తీసుకునే పరిమాణం కన్నా కాస్త తగ్గించి తినాలి. ఉదాహరణకు రెండు అరటి పండ్లను తిన్నారనుకుందాం. కనుక రోజూ తినే అన్నం పరిమాణాన్ని కాస్త తగ్గించాలి. సరిపోతుంది. ఇలా అరటి పండ్లను తింటే బరువు పెరగరు. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అరటి పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాక పొటాషియం, కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతోపాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌లు, ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లావుగా ఉన్నవారు మాత్రం పైన తెలిపిన విధంగా అరటి పండ్లను ఒక నియమం ప్రకారం తినాలి. దీంతో బరువు పెరుగుతామేమోనని బెంగపడాల్సిన పని ఉండదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…