Detox : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. బాడీ మొత్తం క్లీన్ అవుతుంది.. లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది..

October 27, 2023 4:11 PM

Detox : ప్రతి ఒక్కరు, ఈ రోజుల్లో ఆరోగ్య చిట్కాలను పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే, ఏ సమస్య కూడా ఉండదు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటుగా, ఆహార పదార్దాల్లో కూడా మార్పు చేసుకుంటున్నారు. అయితే, ఈరోజు ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం. టీబీ తగ్గాలన్న, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గాలన్న, అలానే సామర్ధ్యం పెరగాలన్న ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఇక ఎలా ఇటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాలని చూసేద్దాం.

టీబీ వచ్చినప్పుడు, బరువు తగ్గిపోవడం మనిషి బాగా ఆరిపోవడం, ఇలా పలు సమస్యలు కనబడుతుంటాయి. ఇటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చాయంటే, శరీరం ఎంతో ఇబ్బంది పడుతోంది. చాలా రకాలుగా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు బాగా బరువు తగ్గిపోతూ ఉంటారు. పేషంట్ లాగ మారిపోతుంటారు. అన్ని టీబీ ఇన్ఫెక్షన్స్ కూడా అంటువ్యాధులు కావు. కేవలం ఊపిరితిత్తులకే టీబీ రాదు. ఎముకలకి కూడా రావచ్చు. అలానే, పేగులకి కూడా రావచ్చు. కండరాలికి కూడా రావచ్చు. వెన్నుకి కూడా రావచ్చు.

take this juice daily one glass to detox body and liver
Detox

టీబీ వచ్చినట్లయితే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని, మందుల్ని వాడాలి. మందులు లేకుండా టీబీ తగ్గిపోతుందని భ్రమ పడకండి. అనవసరంగా చేతులారా, తప్పు నిర్ణయాలు తీసుకుని ప్రమాదంలో పడకండి. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాలని డైట్ లో తీసుకోవాలి.

విటమిన్ సి, విటమిన్ ఏ, సెలీనియం ఉండే ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి. కీర, క్యారెట్, బీట్రూట్, టమాటా, పుదీనా, కరివేపాకు లేదా కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని, జ్యూస్ చేసుకుంటే మంచిది. బత్తాయి, కమల జ్యూస్ లని తీసుకుంటే కూడా మంచిది. ఇలా ఈ సమస్యలు ఉన్నట్లయితే, ఈ జ్యూస్ ని తీసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now