Stamina : ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. తదితర కారణాల వల్ల నేడు అనేక మంది స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అయితే అలాంటి స్త్రీ, పురుషులెవరైనా కింద సూచించిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటుంటే దాంతో వారి లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు, సంతానం కూడా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా ట్రైప్టోఫాన్, అమైనో యాసిడ్లు కూడా అరటి పండ్లలో ఎక్కువే. ఇవి ఆందోళనను తగ్గించడంతోపాటు మంచి మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం లైంగిక శక్తిని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పీనట్ బటర్‌లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డోపమైన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో మహిళలు శృంగారానికి ఉద్యుక్తులవుతారు. జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది.
పింక్ కలర్‌లో కనిపించే బీట్‌రూట్‌ను తినేందుకు చాలా మంది అయిష్టతను ప్రదర్శిస్తారు. కానీ దీన్ని తినడం వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ శృంగార పరంగా అనేక లాభాలు కలుగుతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది. నిత్యం ఒక గుప్పెడు ఎర్ర ద్రాక్ష పండ్లను తింటే చాలు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార పరంగా వచ్చే సమస్యలు పోతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్య నాశనం కాకుండా ఉంటుంది. నిత్యం ఒక కప్పు ఓట్ మీల్‌ను తింటే మగవారిలో లైంగిక సామర్థ్యం డబుల్ అవుతుంది. వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శృంగార పరంగా ఫిట్ అవుతారు.
శృంగారానికి ముందు దంపతులిద్దరూ ఒక కప్పు కాఫీ తాగితే దాంతో ఒత్తిడి, ఆందోళన మాయమవడమే కాదు, ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారట. అలా అని పలువురు సైంటిస్టులు చేసిన అధ్యయనాలే చెబుతున్నాయి. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార వాంఛను పెంచడంలో కాఫీ తోడ్పడుతుందని తెలిసింది. బీన్స్‌లో ప్రోటీన్స్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా స్త్రీ, పురుషులు తమకు కలిగే లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్ వంటి నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తింటుంటే దాంతో విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గానూ పనిచేస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
బియ్యాన్ని పాలిష్ చేసి తెల్లగా ఉంటేనే మనం దాన్ని ఎక్కువగా ఇష్ట పడతాం. కానీ అలా కాకుండా ముడి రూపంలో ఉన్న బ్రౌన్ రైస్‌ను తింటే దాంతో శృంగార శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన్నా అలసిపోరు. నాడులను ఉత్తేజం చేస్తుంది. యాపిల్ పండ్లలో ఫెనిలెథిలమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో జననావయవాలకు రక్తం బాగా సరఫరా అయి శృంగార వాంఛ కలుగుతుంది. ప్లాంట్ హార్మోన్స్ సోయాబీన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో వారిలో లైంగిక వాంఛ, సామర్థ్యం పెరుగుతాయి. మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది.
శరీరానికి కావల్సిన ఉత్తేజాన్ని, శక్తిని అందించే గుణంతోపాటు డ్రై ఫ్రూట్స్‌కు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంది. నిత్యం ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను మెనూలో చేర్చుకుంటే దాంతో కీలక విటమిన్సే కాదు, లైంగికంగా మంచి పవర్ కూడా వస్తుంది. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా వారు లైంగికంగా ఎక్కువ పవర్‌ను పొందుతారు. అంతేకాదు మగవారిలో వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. స్త్రీలలో రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుంది. దీంతో సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, మినరల్స్, మాంగనీస్ వంటి కీలక పోషకాలు మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటాయి. ఇవి స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. కనుక ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే మంచిది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…