Heart Attack : ఈ 4 ఆహారాల‌ను తీసుకుంటే చాలు.. గుండె పోటు అస‌లు రాదు..!

July 19, 2023 8:33 AM

Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో లేకుండా అనేక మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటే అన్ని అవయవాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

ముఖ్యంగా మెదడుకు, గుండెకు రక్తప్రసరణ బాగా జరగాలి. అప్పుడే అవి ఎప్పుడూ చురుగ్గా పనిచేస్తాయి. రక్త నాళాలలో అడ్డంకులు కలిగినా, బ్లడ్ సర్కులేషన్ తగ్గినా వీటి పనితీరుపై ప్రభావం పడుతుంది. మెదడు, గుండె సమస్యలతో బాధపడే వాళ్ళకి రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే డాక్టర్లు మందులు ఇస్తారు. అలా కాకుండా మనం ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె సమస్యలు వంటివి రావు.

take these 4 foods to prevent Heart Attack
Heart Attack

చాలామంది వెల్లుల్లిని వంటల్లో వాడుతుంటారు. వెల్లుల్లిని తీసుకుంటే చక్కటి లాభాలని మనం పొందొచ్చు. వెల్లుల్లి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. వెల్లుల్లిని తరచూ ఆహారంలో తీసుకుంటే, రక్తం చిక్కబ‌డకుండా ఉంటుంది. తరచూ వంటల్లో వెల్లుల్లి వాడితే గుండె సమస్యల‌ ముప్పు ఉండదు. అదేవిధంగా అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండా ఇది చూస్తుంది. అల్లంను తేనెలో నానబెట్టి తీసుకుంటే చక్కటి లాభాన్ని పొందవచ్చు.

రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా అల్లం చూస్తుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా చూస్తుంది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. రక్తప్రసరణని పసుపు కూడా మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. పసుపుని కూడా వంటల్లో తరచూ వాడండి. పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే కూడా మంచిదే. ఉలవలను కూడా తీసుకోండి. ఇవి కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఉలవలు పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి. కొలెస్ట్రాల్ కరగడానికి ఉలవలు బాగా సహాయపడతాయి. ఇలా వీటిని తీసుకుంటే గుండెకు ముప్పు ఉండదు. హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now