Jaggery : రాత్రి ఒక ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. కోట్లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని రోగాలు న‌య‌మ‌వుతాయి..

October 23, 2022 9:47 PM

Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక పంచదారకు బదులుగా బెల్లం ప్రతిరోజూ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

మరి బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాం..  ప్రతిరోజూ బెల్లం చిన్న ముక్క ఆహారంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే కడుపులో ఏర్పడే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ప్రేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బెల్లం మలబద్దకం సమస్యలను దూరం చేయడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.

take one Jaggery piece at night daily for these benefits
Jaggery

బరువు తగ్గాలనుకొనే వారు బెల్లం కలిపిన పాలను తీసుకోవడం మంచి ప్రయోజనం కలుగుతుంది. బెల్లం, పాలలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. కనుక ప్రతి రోజూ బెల్లం కలిపిన పాలను తీసుకుంటే అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు తగ్గి బరువు అదుపులో ఉంటుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తహీనత సమస్య కారణంగా శరీరంలోని రక్తం కొరత ఏర్పడి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనక క్రమం తప్పకుండా బెల్లం తీసుకుంటే రక్తహీనత సమస్యలు తగ్గి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. బెల్లంలో  సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యలను  కారణమయ్యే బ్యాక్టీరియా,వైరస్ ల బారినుండి శరీరాన్ని కాపాడుతాయి.  ప్రతి రోజూ బెల్లం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now