అవిసె గింజలను ఈ విధంగా తీసుకోండి..!

July 8, 2021 8:18 PM

అవిసె గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి. అయితే అవిసె గింజలను కొందరు నేరుగా తినలేరు. అలాంటి వారు వాటిని ఈ విధంగా తీసుకోవచ్చు.

take flax seeds powder in this way

అవిసె గింజలు, మినుములు, శనగలు, ఎండు మిరపకాయలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నింటినీ పెనంపై వేయించాలి. తరువాత వాటిని పొడిలా పట్టుకోవాలి. ఆ పొడిని రోజూ తినే ఆహారంపై చల్లుకుని తినవచ్చు.

పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న పొడిని కూరల్లోనూ వేయవచ్చు. అలాగే సాంబార్‌, సూప్‌, ఇతర రైస్‌ వంటకాల్లో వేయవచ్చు. దీంతో అవిసెగింజలను తీసుకున్నట్లు అవుతుంది. వాటితో ప్రయోజనాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now