ఆరోగ్యం

Sandalwood For Beauty : చ‌ర్మంలోని న‌లుపు మొత్తం పోయి అందంగా మార్చే సీక్రెట్‌..!

Sandalwood For Beauty : ఒక‌ప్పుడు మ‌న పూర్వీకుల‌కు స్నానం చేసేందుకు స‌బ్బులు ఏవీ ఉండేవి కాదు. దీంతో సున్నిపిండి లాంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే స్నానం చేసేవారు. అలా స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌ను వాడేవారు కాబ‌ట్టి ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అలాగే చ‌ర్మం కాంతివంతంగా కూడా ఉండేది. కానీ ప్ర‌స్తుతం మ‌నం ఉప‌యోగిస్తున్న‌వ‌న్నీ కెమిక‌ల్ ప్రొడ‌క్ట్సే. అందువ‌ల్ల మ‌న‌కు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. పైగా చ‌ర్మం కాంతివంతంగా అందంగా మారుతుంద‌ని చెప్పి అనేక ర‌కాల స‌బ్బుల‌ను, బాడీ వాష్‌లు, లోష‌న్ ల‌ను ఉప‌యోగిస్తున్నాం. కానీ వాటి వ‌ల్ల అనుకున్న ఫ‌లితం రావ‌డం లేదు. పైగా ఇత‌ర సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయి. అందువ‌ల్ల మ‌నం స‌హ‌జ‌సిద్ధ‌మైన వాటిని వాడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.

ఇక స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. చంద‌నం. అవును దీన్ని చాలా మంది ఎక్కువ‌గా దైవ కార్యాల్లో ఉప‌యోగిస్తుంటారు. కానీ దీంతో మ‌నం ఎంతో మేలు పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా దీన్ని చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు, చ‌ర్మానికి అందాన్ని తెచ్చేందుకు వాడ‌వచ్చు. చంద‌నం పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. లేదా చంద‌నం క‌ర్ర‌లు కూడా ల‌భిస్తాయి. వీటిని అర‌గ‌దీస్తే చంద‌నం గంధం వ‌స్తుంది. దీన్ని అయినా స‌రే ఉప‌యోగించ‌వ‌చ్చు. చంద‌నం పొడిలో నీళ్లు క‌లిపి అనంతరం వ‌చ్చే పేస్ట్‌ను శ‌రీరం మొత్తానికి రాయాలి. త‌రువాత 30 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల ఎంతో మార్పు క‌నిపిస్తుంది. చ‌ర్మం మృదువుగా మార‌డ‌మే కాదు.. కాంతివంతంగా మారి మెరుస్తుంది. న‌ల్ల‌ని చ‌ర్మం పోయి తెల్ల‌ని చ‌ర్మం వ‌స్తుంది. తెల్ల‌గా మారాల‌నుకునేవారికి చంద‌నం ఇలా ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sandalwood For Beauty

చంద‌నం పొడి ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మంలో న‌లుపు వ‌ర్ణాన్ని ఉత్ప‌త్తి చేసే ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చంద‌నాన్ని వాడుతూ ఉండ‌డం వ‌ల్ల అలాంటి ప‌దార్థాలు పూర్తిగా త‌గ్గుతాయి. దీంతో చ‌ర్మం ఆటోమేటిగ్గా తెల్ల‌గా క‌నిపిస్తుంది. ఇలా చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు కూడా పోతాయి. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది.

అయితే మార్కెట్‌లో మ‌నకు చంద‌నంతో త‌యారైన శాండ‌ల్‌వుడ్ స‌బ్బులు అనేకం ల‌భిస్తున్నాయి. కానీ వాటికి బ‌దులుగా నేరుగా చంద‌నాన్నే ఉప‌యోగిస్తే మంచిది. దీంతో వేగంగా ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌వ‌చ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌వు. చ‌ర్మం అత్యంత స‌హ‌జ‌సిద్ధంగా రంగు మారిన‌ట్లు అవుతుంది. ఇది మ‌న ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయ‌దు. క‌నుక చంద‌నం పొడిని త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ఎంతో అందంగా మార‌వ‌చ్చు. చ‌ర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM