Rice Powder For Face : బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యం పిండి వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు. బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కళ్ళ కింది నల్లని చారలు, నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి, కళ్ళ కింద ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే వృద్ధాప్య లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది.
బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మాన్ని టైట్ గా మార్చి చర్మంపై వయస్సైన లక్షణాలను కనబడనివ్వదు. ఇది టాన్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బియ్యం పిండిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది.
బియ్యం పిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత కడిగేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడడానికి చాలా డల్ గా కనబడుతుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో బియ్యం పిండి హెల్ప్ చేస్తుంది. బియ్యం పిండిలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
బియ్యం పిండిని జల్లించి అందులో మొక్కజొన్న పొడిని మిక్స్ చేసి మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్ల చర్మంపై ఎక్కువ జిడ్డు కనబడదు. ఎక్కువ సమయం పాటు నేచురల్ స్కిన్ ను కలిగి ఉంటారు. ఇది చర్మానికి మెరుపును అందాన్ని ఇస్తుంది. ఇలా బియ్యం పిండిని వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు. రంగు మారుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యవ్వనంలో ఉన్నట్లు ఉంటారు. కనుక బియ్యం పిండిని ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…