Chanakya : ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతిని అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు.
అయితే చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట. ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దట. డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట. పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదట.
వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే అవతలి వ్యక్తులు వాటిపై హాస్యమాడతారు. ఆ సమస్యలపై జోక్‌లు వేసి మరింత విసుగు తెప్పిస్తారు. ఇది సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంది. ఒక వ్యక్తి తన భార్య గురించిన ఏ విషయమైనా ఇతరులతో చర్చించకూడదు. ఏ విషయాన్నయినా రహస్యంగానే ఉంచాలి. ఒక వేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుంది. భార్య గురించిన రహస్యాలను ఇతరులతో పంచుకోరాదు.
ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి. అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు తెలియజేయకూడదు. అలా చేస్తే దానిపై వారు హాస్యమాడతారు. అప్పుడు సదరు వ్యక్తుల మనోభావాలు, గొప్పతనం దెబ్బతింటాయి. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. కనుక ఈ రహస్యాలను పురుషులు ఎప్పుడూ ఎవరికీ చెప్పరాదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…