ఆధ్యాత్మికం

Aghora : అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా..?

Aghora : కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో భయం కలిగించని అన్న అర్థం ఉంది. కానీ వీరి వేషధారణ, అసాధారణ ఆచార వ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదే సమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు అని లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఆఫ్రికన్, ఓరియెంటల్ స్టడీస్ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అభిప్రాయపడ్డారు.

ప్రధాన స్రవంతిలో ఉంటూ ఆధ్యాత్మిక గురువుగా శిష్యులకు ఉపదేశాలిచ్చే మాలిన్సన్ అనేకసార్లు అఘోరాలను కలుసుకున్నారు. అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం, శ‌వాల మ‌ధ్య గ‌డ‌ప‌డం.. వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనాస్థితిని పొందుతామని వారు భావిస్తారు.. అంటారు మాలిన్సన్. కుంభమేళా సమయంలో నదీసంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారని.. ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యాటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారూ ఉంటారని చెప్పారు.

Aghora

నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరని థక్కర్ తెలిపారు. అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని.. పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని.. ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని వారు ఏమాత్రం పట్టించుకోరని చెప్పారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమబెంగాల్‌లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలూ కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు.. అంటారు థక్కర్.

ఇటీవల కొన్ని సంవత్సరాలుగా అఘోరాలు బయటి ప్రపంచంలోని మంచినీ స్వీకరిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. కుష్టు రోగులకు వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. స‌మాజం దూరం పెడుతున్న వర్గాల కోసం అఘోరాలు పనిచేస్తున్నారు.. అని మిన్నెసోటాకు చెందిన మెడికల్, కల్చరల్ ఆంత్రోపాలజిస్ట్ రాన్ బారెట్ చెప్పారు. కుష్టు వ్యాధి బారినపడి సొంత కుటుంబాలకు దూరమైన ఎంతోమందిని అఘోరాలు వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి సేవలందిస్తున్నారు. వారికి ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు అన్ని రకాల వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు కొందరు సెల్‌ఫోన్లు వాడుతున్నారు. ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు.

దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వేల సంఖ్యలో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి. తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు ఉన్నారు. కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు. కానీ అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు.. అని చెప్పారు మాలిన్సన్. ఇంకో విషయం ఏంటంటే.. అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో, పూడ్చిపెట్టడమో చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM