Pregnancy : గ‌ర్బం రావాలంటే.. నెల‌లో ఎన్ని సార్లు చేయాలి..?

April 22, 2023 11:59 AM

Pregnancy : శృంగారంలో రోజూ పాల్గొనడం వల్ల గర్భం రాదు. పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ జననేంద్రియంలో ఉండటం వల్ల గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒకసారి శుక్రకణాలు విడుదలవుతాయి. మామూలుగా మగవారి నుంచి అండంలోకి విడుదలయిన‌ శుక్రకణాలు అయిదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుంచి విడుదలైన అండం 7 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది.

అండంతో ఫలదీకరణం చెందిన తరువాత 10 గంటలలో పిండం ఏర్పడుతుంది. చాలా మందిలో గర్భం రావడానికి శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి అన్న అనుమానం ఉంటుంది. మహిళల్లో అండం విడుదలకు నాలుగు లేక అయిదు రోజులు ముందు కాని అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వల్ల గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదలవుతుందో వారికి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే స్త్రీ జననేంద్రియం లోపల పురుష వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి. స్త్రీ కింద.. పురుషుడు పైన ఉండేలా శృంగారంలో ఉంటే తొందరగా గర్భం వస్తుంది.

Pregnancy in telugu important facts
Pregnancy

గర్భం కోసం వేయికళ్ళతో ఎదురు చూసే వారు మరికొందరు. అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఇది భయం కలిగిస్తుంది. పిల్లులు లేని వారికి ఆతృత పుట్టిస్తుంది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం.. 1194 మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. వారు నెలలో 13 సార్లు శృంగారంలో పాల్గొన్నారు. గర్భాదరణ మీద ధ్యాసతో ఆ పనిచేస్తే పిల్లలు పుట్టరని ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా చేయాలని సూచిస్తున్నారు.

మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు మహిళలలో వీడుదలయ్యే అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భదారణ అని అంటారు. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే పీరియడ్స్ అవ్వడానికి ఒకరోజు ముందు లేదా రెండురోజుల లోపు శృంగారంలో పాల్గొంటే క‌చ్చితంగా గర్భం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సో.. పిల్లలు లేని దంపతులు మీరూ ఇలా ట్రై చేసి చూడండి.. తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు..

గర్భ‌దారణ కోసం సాధారణంగా జంటలు 78 సార్లు శృంగారంలో పాల్గొంటాయని తేల్చారు. అది ఎన్ని రోజుల్లో అనేది మాత్రం వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుందని తెలిపారు. ఇక రోజులో ఒకసారి కంటే ఎక్కువగా శృంగారం లో పాల్గొనకూడదు. ఎక్కువ సార్లు పాల్గొంటే వీర్యం పలుచన అయ్యి ఆరోగ్యమైన శుక్రకణాల శాతం తగ్గుతుంది. ఒకటి రెండు రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొనాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment