Piles : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగటం, మలబద్దకం సమస్య, ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది. ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది.
వామును తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాము పొడి వేసి బాగా కలపాలి. ఈ మజ్జిగను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండాలి. ఫైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి. మసాలాలు, కారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధికంగా ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.
నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి పైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి పైల్స్ సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అయితే మంచిది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…