Peanuts And Water : పల్లీలు ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనబడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి.. తెలుసుకోండి.
పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి.
చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…