ఆరోగ్యం

Coconut Water : రోజూ పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఈ లాభాలు తెలిస్తే తప్పక ట్రై చేస్తారు..!

Coconut Water : కొబ్బ‌రినీళ్ల‌లో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కేవ‌లం ఎండాకాలం మాత్ర‌మే దాహం తీర్చుకోవ‌డం కోసం, శ‌క్తి కోసం తాగుతారు. కానీ నిజానికి ఈ నీళ్ల‌ను ఏ కాలంలో అయినా తాగ‌వ‌చ్చు. ఎప్పుడు తాగినా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ప‌ర‌గ‌డుపున కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ఏ వ్యాధి వ‌చ్చినా త‌ట్టుకునే శ‌క్తి శ‌రీరానికి ల‌భిస్తుంది.

కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం క్లీన్ అవుతుంది. అలాగే మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు రావు. మూత్ర నాళాలు, కిడ్నీల్లో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగితే శ‌రీరానికి కొత్త ఉత్సాహం వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఏ ప‌ని ఎంత సేపు చేసినా త్వ‌ర‌గా అల‌సిపోరు. శారీర‌క శ్ర‌మ చేసే వారు, వ్యాయామం చేసే వారు ఉద‌యాన్నే కొబ్బ‌రినీళ్లను తాగ‌డం వ‌ల్ల అమిత‌మైన శ‌క్తిని పొంద‌వ‌చ్చు. రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే శ‌రీరంలో అద‌నంగా ఉన్న కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

Coconut Water

కొబ్బ‌రి నీళ్లు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు చ‌నిపోతాయి. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌న శ‌రీరానికి నిత్యం త‌గినంత ఫైబర్ అవ‌స‌ర‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి రోజుకు కావ‌ల్సిన ఫైబ‌ర్ అందుతుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. మ‌లబ‌ద్ద‌కం ఉండదు. విరేచ‌నం సాఫీగా అవుతుంది. శ‌రీరంలో నీరు అంతా పోయి డీహైడ్రేష‌న్ బారిన ప‌డే వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. దీన్ని త‌గ్గించుకోవాలంటే ఉద‌యాన్నే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాలి. దీంతో స‌మ‌స్య రాకుండా ఉంటుంది. తల్లి పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. క‌నుక‌ ఈ నీళ్లను పిల్లలు తాగితే వారు మానసికంగా, శారీరకంగా బాగా ఎదుగుతారు. వారికి చ‌క్క‌ని పోష‌ణ ల‌భిస్తుంది.

గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు పోతాయి. దీంతో గ‌ర్భాశ‌యంలో ఉండే బిడ్డకు ఆరోగ్యం క‌లుగుతుంది. పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరినీళ్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి. నేత్ర స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. దృష్టి చ‌క్క‌గా ఉంటుంది. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగితే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంద‌ని పైన చెప్పాం క‌దా. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావు. వ‌య‌స్సు మీద ప‌డినా య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM