ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Natural Remedies : నేటి త‌రుణంలో స‌గ‌టు పౌరున్ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌లు ఎంత‌గా స‌త‌మ‌తం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప్ర‌ధానంగా పెళ్ల‌యిన దంప‌తుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. శృంగార సామ‌ర్థ్యం లోపించ‌డం, పురుషుల్లో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, ఒక‌వేళ అయిన‌ప్ప‌టికీ అందులో ఉత్తేజంగా ఉండే శుక్ర క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో చాలా మందికి పిల్లలు క‌ల‌గ‌డం లేదు. అయితే ఇప్పుడంటే ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చుకునేందుకు మెడిసిన్లు, వైద్యులు అందుబాటులోకి వ‌చ్చారు. కానీ ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఏం మందులు తీసుకున్నారు..? లేదు క‌దా.. మ‌రి వారిలో చాలా మంది ఒక్కొక్క‌రు గంపెడు మంది పిల్ల‌ల్ని ఎలా క‌నగ‌లిగారు..? అంటే.. అవును.. అందుకు కార‌ణం ఉంది. ఎందుకంటే.. వారు కూడా మందులు వాడేవారు. కానీ అవి ఆయుర్వేద ప‌ర‌మైన‌వి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాలలో చిటికెడు కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగాలి. దీంతో పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. సంతానం క‌లిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ల‌లో దొరుకుతుంది. అస్పార‌గ‌స్‌ను తీసుకుని ఎండ‌బెట్టి పొడి చేయాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దానికి ఒక టీస్పూన్ నెయ్యి, చ‌క్కెర‌ల‌ను క‌ల‌పాలి. అనంత‌రం సేవించాలి. ఇలా రోజూ చేశాక వేడి పాలు తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌లు పోతాయి. పురుషుల్లో వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది.

Natural Remedies

శిలాజిత్‌ను ఆయుర్వేదిక్ షాపుల్లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. శిలాజిత్‌ను పొడి చేసి చిటికెడు మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో నెయ్యి లేదా తేనె క‌లిపి సేవించాలి. దీన్ని రోజూ తీసుకుంటే జ‌న‌నావ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా అయి శృంగార సమ‌స్య‌లు పోతాయి. చింత‌పండులో ఉండే గింజ‌ల‌ను తీసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడిపాలలో వేయాలి. అందులో కొద్దిగా చ‌క్కెర క‌ల‌ప‌వ‌చ్చు. అనంత‌రం పాల‌ను బాగా క‌లిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే వీర్య వృద్ధి చెందుతుంది. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య పోతుంది.

అశ్వ‌గంధ‌ మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. దీని పొడిని ఒక టీస్పూన్ మోతాదు తీసుకుని దాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని పాల‌లో వేసి రోజూ రాత్రి తాగితే చాలు. నెల రోజుల్లోనే శృంగార సామ‌ర్థ్యం రెట్టింప‌వుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. ఉసిరికాయ పొడి మ‌న‌కు ఆయుర్వేదిక్ షాపుల్లో ల‌భిస్తుంది. దీన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా క‌లుపుకుని తాగితే దాంతో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. పున‌ర్న‌వ‌ను ప‌లు ప్రాంతాల్లో అటిక మామిడి అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో Boerhavia Diffusa అంటారు. ఈ మొక్క ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అంగ స్తంభ‌న స‌మ‌స్య పోతుంది. ఇలా ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్ల‌తో పురుషులు త‌మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM