Motion Sickness : ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

April 2, 2023 6:52 PM

Motion Sickness : ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ సిక్‌ నెస్‌ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లల్లోనూ ఎక్కువగా కనిపిస్తు ఉంటుంది.

వీరితో పోల్చుకుంటే.. మగవాళ్లలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. మగవాళ్లలో కంటే పిల్లలు, ఆడవాళ్లలో సెన్సిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరంగా కూడా ఇది వస్తుంటుంది.

Motion Sickness what are the reasons why it happens
Motion Sickness

ఇంకా ఆడవాళ్లలో నెలసరి సమయంలో.. గర్భవతులకు, మైగ్రేన్‌, పార్కిన్‌ సన్‌ వ్యాధి ఉన్న వాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే.. ఇలాంటి వారు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేస్తే ఓ నిమ్మకాయ లేదా నిమ్మ రసం అది లేకపోతే.. వాంతులు రాకుండా ఉండే.. టాబ్లెట్లను వెంట ఉంచుకుంటే ఆ సమస్య కు చెక్‌ పెట్టవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now