Coffee : చల్లని వేకువ జామున వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది కదా. ఒక్కో కాఫీ గుటక వేస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే వాహ్ అది అందించే రుచి, తాజాదనం మాటల్లో చెప్పలేం. అలా కాఫీ తాగి చాలా మంది తమ రోజును ప్రారంభిస్తారు. ఇంకొందరైతే బెడ్‌పై ఉండే వేడి వేడి కాఫీని ఆస్వాదించి గానీ తమ రోజును మొదలు పెట్టరు. అయితే కాఫీ ఎలా తాగినా అందులో ఇప్పుడు మేం చెప్పబోయే ఓ మిశ్రమాన్ని కలుపుకుని తాగి చూడండి. దాంతో ఏం జరుగుతుందో కొన్ని రోజుల్లోనే మీరే గమనిస్తారు. అలా కాఫీ తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మాత్రమే కాదు, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుందట.
నెలకు కనీసం ఎంత లేదన్నా 5 నుంచి 7 కిలోల వరకు బరువు తగ్గుతారట. ఇది మేం చెబుతోంది కాదు. పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల ఫలితం. ఇంతకీ కాఫీలో కలపాల్సిన ఆ మిశ్రమం ఏమిటో తెలుసా..? 3/4 కప్పు కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలను తీసుకుని బాగా కలపాలి. కొబ్బరి నూనె (వంటల్లో వాడేది) మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే నూనె గానుగల ద్వారా లభించేది కూడా వాడవచ్చు. అయితే ఆ రెండింటినీ బాగా కలిపి చక్కని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనికి కావాలనుకుంటే తేనె, కోకో పౌడర్ కూడా కలపవచ్చు. ఈ క్రమంలో వాటిని మిశ్రమంగా కలిపి ఓ జార్‌లో నిల్వ చేసుకుని దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి.
రోజూ మీరు కాఫీ తాగేటప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో కలపాలి. అనంతరం ఆ కాఫీని తాగాలి. ఇలా కనీసం నెల రోజుల పాటు చేయండి. దీంతో మీ శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. ఈ విధంగా కాఫీ తాగడం వల్ల నెలకు 5 నుంచి 7 కిలోల వరకు బరువు తగ్గుతారట. దీన్ని సైంటిస్టులు పరిశోధించి చెబుతున్నారు కూడా. అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ పరిశోధక బృందం ఈ మిశ్రమంపై ప్రయోగాలు చేసి బరువు తగ్గుతారని తేల్చి చెప్పింది. కాఫీ, కొబ్బరినూనె, దాల్చిన చెక్క పొడిలలో కొవ్వును కరిగించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలో వీటిని రోజూ తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు ఇలా కాఫీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు. కనుక ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…