Mango Leaves : మామిడి ఆకుల్లో దాగి ఉన్న ఈ ర‌హ‌స్యాల గురించి మీకు తెలుసా..?

March 2, 2023 10:15 PM

Mango Leaves : వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడికాయ రుచి చూడాల్సిందే. అలాగే మామిడి కాయల మీదే కాకుండా మామిడి ఆకుల మీద కూడా దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఫ్లేవ‌నాయిడ్స్, సాపోనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే బొప్పాయి పండులో ఉండే ప‌పైన్‌ అనే ఎంజైమ్ కూడా మామిడి ఆకులలో ఉంటుంది. మామిడి ఆకులలో ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టే పండుగలకు, శుభకార్యాలు జరిగినప్పుడు తప్పనిసరిగా గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాల‌ను కట్టడం సంప్రదాయంగా వ‌స్తోంది.

మనలో చాలా మందికి మామిడి పండు, మామిడికాయల గురించి తెలుసు. కానీ మామిడి ఆకులలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలియదు. మామిడి ఆకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఎన్నో రుగ్మతల నివారణకు వాడుతూ ఉంటారు. మామిడి ఆకుల‌ను నీటిలో మరిగించి లేదా పొడిరూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల‌లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మామిడి ఆకులు నోటి దుర్వాసనను సమర్థ‌వంతంగా తొలగిస్తాయి. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చిన పొగను పీల్చితే గొంతు సంబంధ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

Mango Leaves benefits how many diseases they cure
Mango Leaves

రెండు మామిడి ఆకులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. కొంత మంది విశ్రాంతి లేకుండా విపరీతంగా పనిచేసి తరచూ అలసిపోయి ఒత్తిడికి గుర‌వుతూ ఉంటారు. అలాంటి వారు మామిడి ఆకులతో తయారుచేసిన టీ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. మామిడి ఆకుల‌లో ఉండే పోషకాలు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేసి రీఫ్రెష్ గా ఉండేలా చేస్తాయి. కాలిన గాయాలు త్వరగా నయం కావడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మామిడి ఆకులను కాల్చాలి. కాల్చినప్పుడు వచ్చిన బూడిదను కాలిన గాయాలపై చ‌ల్లితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

మామిడి ఆకులతో తయారుచేసిన టీ తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. మధుమేహాన్ని నివారించడంలో మామిడి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. మామిడి ఆకుల్లో ఉండే టానిన్స్, యాంథో సైనిన్స్ మధుమేహం ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయ‌ని, అలాగే ర‌క్త‌నాళాల‌ సమస్యలను కూడా నివారిస్తాయ‌ని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ ఒక కప్పు మామిడి ఆకుల టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ఆకులు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు సమస్యలు లేకుండా చేస్తాయి. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు మామిడి ఆకుల టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. మామిడి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల‌ శరీరంలోని విషాలను బయటకు పంపడంలో సహాయపడ‌తాయి. క‌నుక ఇక‌పై మామిడి ఆకులు క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి. వీటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment