ఆరోగ్యం

Long Hair : ఇలా జుట్టు పొడ‌వుగా పెర‌గాలి.. అయితే ఏం చేయాలంటే..?

Long Hair : పొడవైన, నల్లని జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధ‌తులతో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే నూనె పెడితే ఏమైనా ఫలితం ఉంటుందా. కొంచెం గోరు వెచ్చటి కొబ్బరినూనెను జుట్టు కుదుళ్ల‌కు అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది.

గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది .కాబట్టి పదిహేను రోజులకొకసారి అయినా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి. గుడ్డు ని అప్లై చేశాక 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకోవాలి. జుట్టు పెరగడంలోనే కాదు మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్ప్‌ చేస్తుంది. గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడని వారు గుడ్డు ప్లేస్ ని పెరుగుతో రీప్లేస్ చేసుకోవచ్చు. పెరుగుని ఒక బౌల్ లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచేసి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. నెలలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.

Long Hair

కలబంద, జొజొబా ఆయిల్ మరియు తేనె ఈ మూడింటిని సమపాళ్లల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి తలస్నానం చేసినట్టయితే మీ వెంట్రుకలలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చటి వాటర్ తో హెయిర్ ని కడగాలి. ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము, నూనె లాంటి వాటిని పోగొడుతుంది. షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా సర్కులర్ మూమెంట్లో షాంపూ చేసుకోవాలి. తలస్నానం చేసాక టవల్ ని తలవెంట్రుకలకు చుట్టి ఉంచాలి. ఈ విధంగా కనీసం 30 నిమిషాలపాటు కట్టి ఉంచితే వెంట్రుకల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాఫ్ట్‌ గా, సిల్కీగా ఉండడానికి తోడ్పడుతుంది.

వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్వెన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఎలాపడితే అలా దువ్వకుండా ఒక క్రమ పద్ధ‌తిలో దువ్వుకుంటూ రావాలి. అప్పు డు వెంట్రుకలు రాలడాన్ని కొంచెం వరకు తగ్గించవచ్చు. ఫైనల్ గా ఇవన్నీ చేసినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోతే అంతా వృథా ప్రయాసే. కాబట్టి పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు చెప్ప‌లేనంత మార్పును చూస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM