కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా ? అయితే ఈ 10 విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి..!

July 11, 2021 10:04 PM

కోవిడ్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. అనేక చోట్ల పెద్ద ఎత్తున టీకాల‌ను వేస్తున్నారు. దేశంలో ప్ర‌స్తుతం కోవిషీల్డ్‌, కోవాగ్జిన్, స్పుత్‌నిక్ వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందువ‌ల్ల ప్ర‌జ‌ల‌కు వాటినే వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకునేందుకు వెళ్తున్న‌వారు ఈ 10 విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అవేమిటంటే..

know these 10 things before you get covid vaccine

1. దేశంలోని ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన టీకాను వేసుకునే వెసులు బాటు ఉంది. పైన తెలిపిన మూడు టీకాల్లో త‌మ‌కు న‌చ్చిన టీకాను వేసుకోవ‌చ్చు. కాక‌పోతే ఏ కేంద్రంలో ఏ టీకాను వేస్తున్నారో ముందుగానే తెలుసుకోవాలి. త‌రువాత యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకుని కేంద్రానికి వెళ్లాలి. టీకాను తీసుకోవాలి. మొద‌టి డోసు తీసుకున్నాక టీకా ర‌కాన్ని బ‌ట్టి నిర్దిష్ట‌మైన తేదీలోగా రెండో డోసును వేసుకోవాలి.

2. కోవిడ్ టీకా ఏ కంపెనీది తీసుకున్నా మొద‌టి, రెండు డోసులు ఒకే టీకా వేసుకోవాలి. రెండు వేర్వేరు టీకాల‌ను తీసుకోరాదు.

3. కోవిడ్ నుంచి కోలుకున్న వారు 84 రోజుల పాటు ఆగాకే టీకా వేసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకుంటే ఏ వ్యాక్సిన్ వేసుకున్నా ఒక్క డోసు తీసుకుంటే చాలు. ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

4. గ‌ర్భిణీలు కూడా టీకాల‌ను తీసుకోవ‌చ్చు. వారి పిల్ల‌లు సుర‌క్షితంగానే ఉంటారు.

5. టీకాను తీసుకున్న త‌రువాత కొంద‌రికి టీకా వేసుకున్న చేతికి నొప్పిగా అనిపిస్తుంది. త‌రువాత జ్వ‌రం, ఒళ్లు నొప్పులు వ‌స్తాయి. 2 రోజుల పాటు ఉన్నాక ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. ల‌క్ష‌ణాలు లేనంత మాత్రాన టీకా ప‌నిచేయ‌డం లేద‌ని అనుకోరాదు. ల‌క్ష‌ణాలు ఉన్నా, రాకున్నా టీకాలు ప‌నిచేస్తాయి.

6. కోవిడ్ టీకా తీసుకున్న త‌రువాత వారం రోజుల వ‌ర‌కు మ‌ద్యం సేవించ‌రాదు. అలా అని చెప్పి దీన్ని ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు. కానీ వైద్యులు మాత్రం సూచిస్తున్నారు.

7. దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కోవిడ్ టీకాను తీసుకున్న త‌రువాత య‌థావిధిగా త‌మ మెడిసిన్ల‌ను వాడుకోవ‌చ్చు. వాటిని ఆపేయాల్సిన ప‌నిలేదు.

8. కోవిడ్ టీకాల‌ను ప్ర‌స్తుతం 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికే వ‌స్తున్నారు. ప‌లు కంపెనీలు చిన్నారుల కోసం ప్ర‌త్యేక‌మైన టీకాల‌ను రూపొందిస్తున్నాయి. వాటికి గాను ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హిస్తున్నారు. అందువ‌ల్ల మ‌రో 6 నెలల్లో వారికి కూడా టీకాలు అందుబాటులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

9. కోవిడ్ టీకాల‌ను తీసుకున్న త‌రువాత పోష‌కాహారం తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని మ‌రింత పెంచుకోవ‌చ్చు.

10. టీకా తీసుకున్న త‌రువాత కేంద్రంలోనే 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తే వెంట‌నే చికిత్స‌ను అందించేందుకు వీలు క‌లుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now