Immunity Tea : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. మీరు కూడా, రోగినిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా…? అయితే, కచ్చితంగా ఇలా చేయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల టీ ని తీసుకోవడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. నరాలు యాక్టివ్ గా మారుతాయి. అలానే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సెల్ల్స్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఇంఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది.
అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా, ఈ టీ లో ఉంటుంది. కాబట్టి, అనేక ఉపయోగాలు ఉంటాయి. దగ్గు, జలుబు మొదలైన వాటికి కూడా ఔషధంలా పనిచేస్తుంది. గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని పొడి చేసుకుని, పక్కన ఉంచుకొని, ఎప్పటికప్పుడు కలిపి తీసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర, శొంఠి, దాల్చిని, లవంగాలు, మిరియాలు దీనిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని, మనం వీటిని తయారు చేసుకోవాలి.
లవంగాల ఘాటు ఎక్కువ ఉంటాయి. కాబట్టి, తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటినీ ఎండబెట్టి విడివిడిగా పొడి చేసుకుని, పక్కన ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో, అప్పుడు పొడులను తీసుకొని మిక్స్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ని తీసుకుని, 100 నుండి 150 మిల్లీమీటర్ల నీళ్లు తీసుకుని బాగా మరిగించుకోవాలి.
నీళ్లు బాగా మరిగిన తర్వాత, ఈ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని తర్వాత అందులో తేనె వేసుకుని తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వేడివేడిగా ఈ టీ ని తీసుకుంటే బాగుంటుంది. ఎంతో చక్కటి ఉపశమనం కలుగుతుంది. చాలా రకాల సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…