Coconut : ప్రతి ఒక్కరు కూడా, కొబ్బరిని వాడుతూ ఉంటారు. కొబ్బరి పచ్చడి వంటివి చేయడంతో పాటుగా, కొబ్బరిని తురిమేసి, ఎందులోనైనా వాడుతూ ఉంటాము. అయితే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత, ముక్కలు కింద కట్ చేసుకోవడం పెద్ద సమస్య అవుతుంటుంది. కొబ్బరి పెచ్చు నుండి తీయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే, కొబ్బరి చిప్ప నుండి ఎలా కొబ్బరిని బయటకు తీయాలి..? ఈజీగా ఎలా తీసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక చేశారంటే, ఈజీగా క్షణాల్లో కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని, మొత్తం తీసేయొచ్చు.
పైగా ముక్కలా వచ్చేస్తుంది. చేతులు కూడా నల్లగా అయిపోవు. ఈజీ టెక్నిక్ ఇది. ముందు కొబ్బరికాయని కొట్టండి. రెండు చిప్పల కింద కొబ్బరికాయ విడుతుంది కదా, ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి, ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఇడ్లీ రేకులు పెట్టి రేకుల మీద కొబ్బరిచిప్పని బోర్లించి పెట్టండి. రెండు చిప్పల్ని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. ఒక పది నుండి 15 నిమిషాల పాటు, స్టవ్ ఆన్ చేసి పెట్టండి. తర్వాత స్టవ్ ఆపేసి, చల్లారిన తర్వాత ఇడ్లీ పాత్ర ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు ఒక చాకు తీసుకుని, కొబ్బరి చిప్పని చేత్తో పట్టుకుని, కొబ్బరి పెచ్చు చుట్టూ కూడా చాకుతో తీయండి. ఇలా జస్ట్ మనం చాకుతో గుండ్రంగా కొబ్బరి చిప్ప అంతా కూడా తీస్తూ ఉంటే, ఈజీగా చిప్ప నుండి కొబ్బరి వచ్చేస్తుంది.
పైగా ఇలా ఉడికించడం వలన దాని రుచి కూడా ఏమీ మారదు. రుచి కూడా సేమ్. అలానే, ఎందులోనైనా మనం వాడుకోవచ్చు. కొబ్బరి పచ్చడి నుండి ఏ వంటకం చేసుకోవాలన్నా కూడా, ఇలా ఈజీగా మనం కొబ్బరి ని తీసుకోవచ్చు. ఈసారి, ఈ టెక్నిక్ ని ఫాలో అయిపోయి, ఈజీగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి ని తీసేసుకోండి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…