మీ కాళ్ల‌లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..!

August 30, 2023 10:43 AM

మన కాళ్లు.. శరీరంలో ఎక్కువ బరువుని మోస్తాయి. రోజంతా శరీరాన్ని మోసే కాళ్ళ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. కాళ్ల సమస్యలని చాలా మంది ఎదుర్కొంటున్నారు. పాదాల వాపు లేదంటే కాళ్ల‌ నొప్పులు మొదలైన సమస్యల్ని మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కాళ్లు ఉబ్బడం, కాళ్ళల్లోని సిరలు ఉబ్బడం మొదలైనట్లయితే కచ్చితంగా మీకు సమస్య ఉందని గుర్తుపెట్టుకోవాలి.

ప్రేగులు, పాంక్రియాస్, కాలేయం మధ్య రక్తప్రసరణలో సమస్యలు ఉన్నట్లయితే ఇలా జరుగుతుంది. సిరల లోపం సమయంలో రక్తం అవయవాల‌ నుండి గుండెకి కష్టంగా కదులుతుంది. ఒకవేళ ఏదైనా దెబ్బ తిన్నా లేదంటే, ఇబ్బంది కలిగినా కాళ్లలో వాపులు కలుగుతూ ఉంటాయి. కాళ్లల్లో రంగు కూడా మారుతూ ఉంటుంది. పాదాల‌ వాపులు వంటివి కలిగితే కిడ్నీ సమస్యలు అని చెప్పొచ్చు. పాదాల్లో వాపు రావడం, కండరాలు, తిమ్మిర్లు, కాళ్లు చల్లగా ఉండడం వంటివి థైరాయిడ్ గ్రంథిలో సమస్యను సూచిస్తున్న‌ట్లు అర్థం చేసుకోవాలి.

if you see these symptoms in your legs then beware

ఇలాంటివి కనిపిస్తే కూడా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. చిన్నపాటి గాయాలు కూడా త్వరగా మానకపోతున్నట్లయితే మధుమేహం అని గ్రహించాలి. అలాగే కాళ్ళలో సూది లాంటి అనుభూతిని అనుభవిస్తే కూడా అది డయాబెటిస్ లక్షణమే. ఇలా మీరు కాళ్ల ద్వారా సమస్యల్ని గుర్తించొచ్చు. అలాగే పోషకాహార లోపం లేదంటే అధిక ఒత్తిడి వలన కూడా కాళ్లు, పాదాలలో మార్పు వస్తూ ఉంటుంది.

ఎప్పుడైనా సరే కాళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తే లైట్ తీసుకోకండి. క‌చ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలని కాళ్ళ ద్వారా మనం గుర్తించొచ్చు అని గ్రహించి, కాళ్ల సమస్యలు ఏమైనా వస్తే, నిర్లక్ష్యం చేయకుండా ముందు వైద్యుని సలహా తీసుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య లేకుండా మీరు ముందే జాగ్రత్త పడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment