Eggs : చాలా మంది శాకాహారులు, మాంసాహారులు కూడా కోడి గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్ల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రత్యేకించి కోడిగుడ్ల వలన ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది చెప్పక్కర్లేదు. వ్యాయామం చేసే వాళ్లయితే రోజూ కూడా కోడిగుడ్లని తీసుకుంటూ ఉంటారు. ఈరోజుల్లో చాలామంది శాకాహారులు కోడి గుడ్లని తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ కోడి గుడ్డుని ఇంకా నాన్ వెజ్ గా భావించి కోడిగుడ్ ని తినని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ప్రోటీన్ ఏ విధంగా అందుతుంది.. అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
నిజానికి ఈ ఆహార పదార్థాలలో కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పైగా ఇవి మాంసాహారం కూడా కాదు. మరి శాకాహారులు తీసుకోవలసిన ప్రోటీన్ ఫుడ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యానికి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ మొదలైనవి గింజలలో ఉంటాయి. గింజలను తీసుకోవడం వలన కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనకు డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది.
కోడిగుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మనం చిరుధాన్యాల ద్వారా పొందొచ్చు. పప్పు దినుసులలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. చిరుధాన్యాలను తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. గుమ్మడి గింజల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గుమ్మడి గింజల్ని తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది.
సోయా పాలతో తయారుచేసిన టోఫు తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. మాంసాహారానికి బదులుగా టోఫుని తీసుకోవచ్చు. క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. శనగలలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీన్స్ లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బీన్స్ ని తీసుకుంటే గుండె జబ్బులు కూడా రావు. బ్లాక్ బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది.
రాజ్మాని కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగా అందుతుంది. కినోవా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా పాలల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పాలు తీసుకుంటే కూడా ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా, గుడ్డుకి బదులుగా ప్రోటీన్ ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…