Juices For Diabetes : చాలామంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చాలామంది టైప్ 2 డయాబెటిస్ వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో షుగర్ వచ్చి బాధపడుతున్నారు. అయితే షుగర్ రాకుండా ఉండాలన్నా, షుగర్ కంట్రోల్ లో ఉండాలన్నా నాచురల్ పద్ధతుల్ని పాటించడం మంచిది.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ లని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. మధుమేహం రాకుండా ఉండవచ్చు. వేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా వేపాకుని వాడతారు. ఖాళీ కడుపుతో వేపాకు జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఆకలి తగ్గుతుంది. కడుపులో కీటకాలు చచ్చిపోతాయి. కాకరకాయ రసం తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. కలబంద రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ రాకుండా ఉండాలంటే సొరకాయ రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో సొరకాయ రసాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
గోధుమ గడ్డి రసం కూడా తీసుకోవచ్చు. గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉత్తమం. దీనిలో ఉండే అమైనో యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు లేకుండా కూడా చూసుకుంటాయి. పొట్ట తగ్గుతుంది. జీర్ణాశయం శుభ్రపడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
అంతేకాకుండా షుగర్ రాకుండా ఉండాలంటే బీట్ రూట్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ లోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగించడమే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. గుండెపోటు కూడా రాదు. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా కంట్రోల్ లో ఉంచగలదు బీట్ రూట్. సో చూశారు కదా ఏ జ్యూస్‌లని తీసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది అని.. మరి ఈ జ్యూస్‌లని ఉదయం పూట తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…