నిత్యం అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. బెండకాయలో ఉన్న పోషక విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఎర్ర బెండకాయలో సాధారణ బెండకాయ కంటే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర బెండలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్ తో అన్ని రకాల విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎర్ర బెండకాయను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీర పెరుగుదలకు అవసరమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ , ఫైబర్ వంటి పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా జీవించడానికి సహాయపడతాయి.ఎర్ర బెండలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయి. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి బీపి, గుండె జబ్బు వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఎర్ర బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం తొలగి శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను నివారిస్తుంది. విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఎర్ర బెండను తరచూ ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…