Hand Wash Vs Soap : స‌బ్బు లేదా హ్యాండ్ వాష్‌.. ఏది ఉప‌యోగిస్తున్నారు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

May 3, 2023 10:27 PM

Hand Wash Vs Soap : మ‌న‌లో అధిక శాతం మంది భోజనానికి ముందు చేతుల‌ను స‌బ్బుతో లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటారు. రోగాలు రాకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త‌గా ప్ర‌తి ఒక్క‌రు త‌మ చేతుల‌ను స‌బ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం కూడ త‌మ ప్ర‌క‌ట‌న‌ల్లో చెబుతూ వ‌స్తోంది. అయితే స‌బ్బు క‌న్నా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటేనే 100 శాతం క్రిములు చ‌నిపోతాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజమే.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అధ్యయనం ప్రకారం.. ఘ‌న రూపంలో ఉండే స‌బ్బు క‌న్నా ద్ర‌వ రూపంలో ఉండే హ్యాండ్ వాష్ వ‌ల్లే చేతులు 100 శాతం శుభ్రంగా మారుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు స‌బ్బు క‌న్నా హ్యాండ్ వాష్ తోనే చేతుల‌ను శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

Hand Wash Vs Soap which one is better for hands
Hand Wash Vs Soap

అయితే ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు, బ‌య‌ట తిరిగిన‌ప్పుడు హ్యాండ్ వాష్ లు అందుబాటులో ఉండ‌క‌పోతే హ్యాండ్ శానిటైజ‌ర్‌లు వాడాలి. ఇవి కూడా ద్ర‌వ రూపంలో ఉంటాయి. వీటిని రెండు, మూడు చుక్క‌ల‌ను చేతుల్లో వేసుకుని చేతుల‌ను క‌డుక్కున్న‌ట్లు శుభ్రం చేసుకోవాలి. వీటికి నీరు కూడా అవ‌స‌రం లేదు. హ్యాండ్ శానిటైజ‌ర్ల వ‌ల్ల కూడా చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. అయితే స‌బ్బు వాడ‌కూడ‌దా.. అంటే.. వాడ‌వ‌చ్చు.. కానీ 100 శాతం క్రిములు చ‌నిపోతాయ‌న్న గ్యారంటీ లేదు. కానీ క్రిములు కొంత వ‌ర‌కు అయితే నిర్మూలింప‌బ‌డ‌తాయి. ఏది ఏమైనా ప్ర‌తి ఒక్క‌రు తినేముందు త‌మ త‌మ చేతుల‌ను మాత్రం క‌చ్చితంగా శుభ్రం చేసుకోవాల్సిందే. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment