Hair Growth : వాజలిన్‌ను ఎవరైనా చలికాలంలో చర్మం పగిలితే వాడుతారని అందరికీ తెలిసిందే. ఇక కొందరికైతే కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ చర్మం పగులుతూ ఉంటుంది. దీంతో వారు అన్ని కాలాల్లోనూ వాజలిన్‌ను ఉపయోగిస్తారు. అయితే వాజలిన్‌తో నిజానికి ఈ ఒక్క ఉపయోగం మాత్రమే కాదు, మరో ఉపయోగం కూడా ఉంది. అదేమిటంటే.. వాజలిన్ సహాయంతో మీ జుట్టును రోజుకు ఒక అంగుళం వరకు పెంచుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే.
వాజలిన్‌ను ఉపయోగించి తయారు చేసే ఓ మిశ్రమాన్ని వాడడం వల్ల మీ జుట్టు రోజుకు ఒక ఇంచు పెరుగుతుందట. అలా అని చెప్పి దీన్ని వాడిన వారే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అయితే మరి ఆ మిశ్రమాన్ని తయారు చేయడం ఎలా.. అంటే.. అది ఎలాగో కింద చూడండి.
వాజలిన్ మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం నూనె (ఆల్మండ్ ఆయిల్) – సరిపోయినంత, విటమిన్ ఇ క్యాప్సూల్స్ – 400 ఎంజీ 2 క్యాప్సూల్స్, వాజిలిన్ పెట్రోలియం జెల్లీ – ఏదయినా జెల్లీ సరిపోయినంత తీసుకోవచ్చు.
తయారీ విధానం..
ఒక పాత్రలో ఒక టీస్పూన్ వాజలిన్ పెట్రోలియం జెల్లీ తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ని వేయాలి. వెంట్రుకలు బాగా ఉన్నవారైతే వారి హెయిర్ కి సరిపడినంతగా ఆయిల్ కూడా వేయవచ్చు. ఇక ఆ మిశ్రమంలో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ 600ఎంజీ విటమిన్ ఇ క్యాప్సూల్ వాడాలనుకుంటే మాత్రం ఒక్కటే కట్ చేసుకుని అందులోని పదార్థాన్ని బౌల్ లోకి పిండుకోవాలి.
ఇక బౌల్ లోకి తీసుకున్న పైన చెప్పిన మూడు పదార్థాలనూ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయగా వచ్చే మిశ్రమాన్ని మూడు ఫింగర్ టిప్స్ (మూడు చేతి వేళ్ల సహాయం) తో తలపై మాడుకు పట్టించాలి. మాడుకు మర్దనా అయ్యేలా సర్క్యులర్ మోషన్ లో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అనంతరం మిశ్రమం డ్రై కాగానే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే కచ్చితంగా వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. మరింకెందుకాలస్యం.. వెంటనే ఈ మెథడ్‌ను ఫాలో అయిపోండి మరి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…