Green Color On Potatoes : ఈ రంగులో ఉన్న ఆలును తింటున్నారా.. అయితే డేంజ‌రే.. ఎందుకంటే..?

March 15, 2023 5:00 PM

Green Color On Potatoes : నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే.. ఇక అంతే సంగతులు. అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది..? ఎలా తెలుసుకోవాలి..? చూద్దాం పదండి. ముందుగా బంగాళాదుంపల విషయానికి వద్దాం. వీటిలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీరు కొన్న ఆలుగడ్డల్లో ఎక్కడైనా వాటి సహజ రంగులో కాక ఆకుపచ్చ రంగులో ఉన్న ఆలుగడ్డలు కనిపించాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి. ఎందుకంటే అవి విషపూరితంగా ఉంటాయి. వీటిని తింటే నరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయట. ఇప్పుడు కోడిగుడ్లు. కోడిగుడ్లను పగలగొట్టిన తరువాత వాటిలో ఉండే తెల్ల, పచ్చని సొనలు కలసి కట్టుగా, విడదీయరాకుండా ఉన్నాయా? అయితే అవి కూడా హానికరమేనట. వెంటనే వాటిని పారేయండి. మనలో అధిక శాతం మందికి బ్రెడ్ అంటే ఇష్టం. అయితే దీన్ని తాజాగానే తినాలి. బూజు పట్టిందాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ కొద్దిగా బూజు పడితే దానంత వరకు తీసేసి మిగతాది తిన్నా హానికరమేనట. ఇవి క్యాన్సర్ రోగాలను తెచ్చిపెడతాయట.

Green Color On Potatoes can you eat them know what happens
Green Color On Potatoes

నిల్వ ఉంచిన డ్రై ఫుడ్, పాప్ కార్న్ వంటివి వాసన వస్తే వాటిని పారేయాల్సిందే. లేదని తింటే మనకు అనారోగ్యాలను తెచ్చి పెడతాయి. ఆహార పదార్థాలను ఉంచే షెల్ఫ్‌లను (ఫ్రిజ్‌లోనైనా, బయటైనా) కనీసం వారానికోసారి అయినా క్లీన్ చేయాలట. లేదంటే వాటికి అంటుకుని ఉండే బ్యాక్టీరియా ఇతర వంటకాల్లోకి కూడా ప్రవేశిస్తుందట. దీంతో ఆహారాలు త్వ‌ర‌గా పాడ‌వుతాయి. క‌నుక రోజూ మీరు తినే ఆహారాల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ప‌డ‌తారు. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment