Ginger Juice : నిత్యం మనం అల్లంను వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక మాంసాహార వంటకాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవలం రుచికే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలో, అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ అల్లం బాగా ఉపయోగపడుతుంది. మరి అల్లంతో మనం ఎలాంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం రసం సేవిస్తే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుంది. అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్లం రసాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజులకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో అల్లం మెరుగ్గా పనిచేస్తుంది. నిత్యం అల్లం రసం సేవించడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…