Food Combinations : ముద్దపప్పులో పప్పుచారు కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఆ మజానే వేరు. అలాగే పచ్చి పులుసులో బంగాళాదుంప ప్రై, గట్టిపప్పులో ఆవకాయ్ ఇలా.. రకరకాల కాంబినేషన్స్ రుచికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. వంటింట్లో ఉన్న అమ్మను.. అమ్మా ఈ రోజు దోసకాయ్ పప్పు వండవే.. అంటూ టీవీ రూమ్ లో కూర్చొని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కాంబినేషన్ కు ఉన్న టేస్ట్ అది. కానీ కొన్ని కాంబినేషన్లు మనకు హానిని కూడా కలిగిస్తాయి. అటువంటి కాంబినేషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. స్టార్చీ కార్బొహైడ్రేట్స్ చిలగడ దుంపల్లో ఉంటాయి. కార్బొహైడ్రేట్స్‌తో సిట్రిక్ యాసిడ్ కలిపి తింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది. కనుక టమాటాలు, చిలగడ దుంపలను కలిపి తినరాదు. అలాగే పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. వీటిని భోజనంతో కలిసి తీసుకోవడం వల్ల భోజనంలో ఉండే పోషకాలు త్వరగా జీర్ణం కావు. కాబట్టి వాటితోపాటు పండ్లు కూడా జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది. సో.. ఆలోపే పండ్లు కుళ్లిపోతాయ్. దాని కారణంగా పేగులోని లోపలి పొర దెబ్బతింటుంది. కనుక భోజనాన్ని, పండ్లను కలపరాదు. కాస్త గ్యాప్ ఇచ్చి తినాలి.
మాంసం ఉత్పత్తుల్లోని మాంసకృత్తులు పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రో న్యూట్రియెంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది. కనుక మాంసంతో పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోరాదు. అలాగే పాల ఉత్పత్తులు సైనస్ లను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి. రెండింటినీ కలిపి తినరాదు. ఇలా ఈ ఫుడ్ కాంబినేషన్స్‌కు దూరంగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…