Hair Growth : నేటి తరుణంలో జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు పలుచబడడం, జుట్టు చిట్లడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతాయి. జుట్టు మనం అందంగా కనిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక దీనిని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం చాలా అవసరం. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
జుట్టు సమస్యలతో బాధపడే వారు మన ఇంట్లోనే ఒక చక్కటి నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ నూనెను తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే ఈ చిట్కాను వాడడానికి కూడా ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం లేదు. జుట్టు సమస్యలను తొలగించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ మనం మందార పువ్వులను అలాగే మందార ఆకులను ఉయోగించాల్సి ఉంటుంది. మందార ఆకులు, పువ్వులు మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్న సంగతి మనకు తెలిసిందే.
ఎంతో కాలంగా కేశ సంరక్షణ కోసం మందార ఆకులను, పువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం ముందుగా పది మందార ఆకులను, పది మందార పువ్వులను తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను పోసి వేడి చేయాలి. కొబ్బరి నూనె వేడైన తరువాత మందార పువ్వుల పేస్ట్ ను అందులో వేసి కలపాలి. ఈ నూనెను మరో రెండు నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి నిల్వ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు చక్కగా పట్టించాలి. తరువాత నూనె కుదుళ్లలోకి ఇంకేలా చక్కగా మర్దనా చేయాలి. దీనిని అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. వీలున్న వారు దీనిని రాత్రి పడుకునే ముందు జుట్టుకు రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…