Fat Burning : కొందరు చూడడానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావడంతోపాటు కొవ్వును కూడా కరిగించుకోవాలంటే మన రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. దాంతో పాటు మనం చేసే వ్యాయామాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడు కొవ్వు కరగడంతోపాటు కండరాలు కూడా దృఢంగా మారి మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు. మనం ఒక సమయంలో ఒకే వ్యాయామం చేస్తుంటాం. అది కంప్లీట్ అయ్యాక వేరేది చేస్తాం. కానీ ఇకపై ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాయామాలను చేయడానికి ప్రయత్నించండి.
ఇలా రెండు వేర్వేరు వ్యాయామాలను ఒకేసారి చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఉదాహరణకు జంపింగ్, పుల్ అప్స్ కలిపి చేయండి. హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. శరీరానికి నీరెంత అవసరమో మనకు తెలుసు. కావాల్సినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దాంతో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తీసుకున్నప్పుడే మీ కండరాలు దృఢంగా ఉంటాయి. కొందరు రెస్ట్ లేకుండా వ్యాయామాలు చేస్తునే ఉంటారు. దాని ఫలితంగా శరీరం అలసిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి మన శరీరం కోలుకుని తిరిగి శక్తి పుంజుకోవాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.
కాబట్టి ప్రతిరోజూ దాదాపు ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. వారంలో ఒక్క రోజైనా వ్యాయామాలకు విరామం ఇవ్వడం వల్ల మరుసటి వారం అంతా మీరు నూతనోత్సాహంతో ఉండగలుగుతారు. ఈత, సైక్లింగ్, పరుగు లాంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల కొవ్వు కరిగి కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే వీటిని క్రమంగా పెంచుతూ, సమయాన్ని కూడా పొడిగించుకుంటూ వెళితే మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాదు గుండె కండరాలు కూడా బలపడతాయి. రోజుల తరబడి ఒకే విధమైన వ్యాయామాలు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడూ వాటిని మార్చడం వలన కండరాలకు మంచిది. దీంతోపాటు కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల కొవ్వును కరిగించుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కనుక ఒక్కసారి ఇలా చేసి చూడండి. రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి.
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…