Fat Burning : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కొవ్వును క‌రిగించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

March 18, 2023 5:03 PM

Fat Burning : కొందరు చూడ‌డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావడంతోపాటు కొవ్వును కూడా కరిగించుకోవాలంటే మన రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. దాంతో పాటు మనం చేసే వ్యాయామాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడు కొవ్వు కరగడంతోపాటు కండరాలు కూడా దృఢంగా మారి మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు. మనం ఒక సమయంలో ఒకే వ్యాయామం చేస్తుంటాం. అది కంప్లీట్ అయ్యాక వేరేది చేస్తాం. కానీ ఇకపై ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాయామాలను చేయడానికి ప్రయత్నించండి.

ఇలా రెండు వేర్వేరు వ్యాయామాల‌ను ఒకేసారి చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఉదాహరణకు జంపింగ్‌, పుల్ అప్స్‌ కలిపి చేయండి. హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. శరీరానికి నీరెంత అవసరమో మనకు తెలుసు. కావాల్సినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దాంతో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తీసుకున్నప్పుడే మీ కండరాలు దృఢంగా ఉంటాయి. కొందరు రెస్ట్ లేకుండా వ్యాయామాలు చేస్తునే ఉంటారు. దాని ఫలితంగా శరీరం అలసిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి మన శరీరం కోలుకుని తిరిగి శక్తి పుంజుకోవాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.

Fat Burning it is very easy if you follow these steps
Fat Burning

కాబట్టి ప్రతిరోజూ దాదాపు ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. వారంలో ఒక్క రోజైనా వ్యాయామాలకు విరామం ఇవ్వడం వల్ల మరుసటి వారం అంతా మీరు నూతనోత్సాహంతో ఉండగలుగుతారు. ఈత, సైక్లింగ్‌, పరుగు లాంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల కొవ్వు కరిగి కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే వీటిని క్రమంగా పెంచుతూ, సమయాన్ని కూడా పొడిగించుకుంటూ వెళితే మీ ­ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాదు గుండె కండరాలు కూడా బలపడతాయి. రోజుల తరబడి ఒకే విధమైన వ్యాయామాలు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడూ వాటిని మార్చడం వలన కండరాలకు మంచిది. దీంతోపాటు కొవ్వు కూడా క‌రిగిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల కొవ్వును క‌రిగించుకోవ‌డం కూడా పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. క‌నుక ఒక్క‌సారి ఇలా చేసి చూడండి. రిజ‌ల్ట్ వ‌స్తే కంటిన్యూ చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment