Train Seats : బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు. చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగుండును అని అనుకుంటాం. ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు. నిద్ర ప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక సైన్స్ ఉందని తెలుసా.. బస్ అంటే మనకు కావాలసిన సీట్ బుక్ చేసుకుంటాం. సినిమా హాల్‌లో అయినా మనకు నచ్చిన సీట్ తీసుకుంటాం. కానీ ట్రెయిన్‌లో అలా కుదరదు. వాళ్లు ఏ సీట్ కేటాయిస్తే అదే తీసుకోవాలసి ఉంటుంది. అసలు ట్రెయిన్ లో సీట్ లను ఎలా కేటాయిస్తారో తెలుసా. దానికోసం వారు ఎలాంటి క్రమపద్ధతిని అనుసరిస్తారో తెలుసా. క్రమ పద్ధతి పాటించకపోతే ట్రెయిన్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుందని మీకు తెలుసా. అవన్నీ విషయాలను తెలుసుకోండి.
ప్రయాణికుల బరువును అన్ని కోచ్‌ల్లో, అన్నివైపులా సమానంగా పంచేలా ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్ టికెట్‌లను బుక్‌చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు (ఎస్ 1- ఎస్10) ఉన్నాయనుకుందాం. ఒక్కో కోచ్‌లో 72 సీట్లతో మొత్తం 720 సీట్లు ఉంటాయి. మొదటగా బుక్‌చేసుకునే వ్యక్తికి మధ్యభాగంలో అంటే ఎస్-5 బోగీలో సాఫ్ట్‌వేర్ సీటును కేటాయిస్తుంది. కోచ్‌లోనూ మిడిల్ సీటు నుంచి టిక్కెట్లను బుక్ చేస్తుంది. అంటే 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరగా బుక్‌చేసుకునే వ్యక్తికి ఎస్1 లేదా ఎస్ 10 బోగీలో సీటును బుక్‌చేస్తుంది.
బెర్త్ విషయంలోనూ మొదటగా లోయర్ బెర్త్, ఆ తర్వాత మిడిల్ బెర్త్, చివరకు అప్పర్‌బెర్త్‌ను కేటాయిస్తుంది. అలా కాకుండా ఒక క్రమపద్ధతి లేకుండా టికెట్‌లను కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది. ఇలాంటి సమయాల్లో ములుపుల దగ్గర ట్రైన్ పడిపోయే ప్రమాదముంటుంది. కొన్ని బోగీలపై ఎక్కువ అపకేంద్రబలముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఫలితంగా రైలు పట్టాలు తప్పుతుంది. అందుకే రైలు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు భద్రతా చర్యల్లో భాగంగానే సీట్ల కేటాయింపును ఇలా ఒక క్రమపద్ధతిలో చేస్తారు. అందువల్లే మనకు రైళ్లలో మనకు కావల్సిన సీటును బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సాఫ్ట్‌వేర్ ఆటోమేటిగ్గా మనకు ఆ పని చేసి పెడుతుంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…