Bamboo Plant : చాలా మంది తమ తమ ఇండ్లలో తులసి, బాంబూ, మనీ ప్లాంట్, అపరాజిత వంటి మొక్కలను పెంచుకుంటారు. వీటి వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం కలుగుతుందని, ధనం నిలుస్తుందని వారి నమ్మకం. అయితే అంత వరకు ఓకే. కానీ బాంబూ మొక్క విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టుకుంటేనే తద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందట. దీంతో అంతా శుభమే కలుగుతుందట. మరి బాంబూ మొక్కను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారమైతే బాంబూ మొక్కలను భూమి, నీరు, అగ్ని, లోహం అనే అంశాలు ప్రతిబింబించే విధంగా పెట్టుకోవాలట. దాంతో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమై వారందరికీ మంచే జరుగుతుందట. అనుకున్నవి నెరవేరుతాయట. అయితే అలా ఆయా అంశాలను ప్రతిబింబించేలా మొక్కను పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
బాంబూ మొక్కను ఓ చిన్న కంటెయినర్‌లో ఉంచి అందులో 2-3 ఇంచుల లోతులోనే నీటిని పోయాలి. దీంతో నీరు అనే అంశం ప్రతిబింబిస్తుంది. ఆ నీటిలో ఏదైనా ఓ నాణేన్ని వేయాలి. దీంతో లోహం అంశం పూర్తవుతుంది.
అదే నీటిలో రాళ్లను వేస్తే అది భూమిని ప్రతిబింబిస్తుంది. ఇక ఆ మొక్క అగ్నిని ప్రతిబింబించాలంటే దాని చుట్టూ ఎరుపు రంగు దారం కట్టాలి. దీంతో ముందు చెప్పిన నాలుగు అంశాలు ప్రతిబింబిస్తాయి.
అనంతరం మొక్కలో బేసి సంఖ్యలో కాండాలు ఉండేలా చూసుకోవాలి. అలా సరి చేశాక ఆ మొక్కను సూర్య రశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. దీంతో మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరికీ లక్ కలసి వస్తుంది. ఏం చేసినా సరే తప్పక విజయం సాధిస్తారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…