Peanuts : ప‌ల్లీల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగ‌రాదు.. ఎందుకో తెలుసా..?

March 6, 2023 5:42 PM

Peanuts : పల్లీల‌ని ఇష్టపడని వారుండరు. వేపుడు చేసుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనపడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీల‌ను తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు.. పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు.. తాగితే సమస్యెందుకు వస్తుంది.. దానికి కారణాలు ఏంటి.. అనే విష‌యాల‌ను తెలుసుకోండి.

పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. క‌నుక ప‌ల్లీల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగొద్ద‌ని అంటారు.

drinking water after eating Peanuts is harmful know the reasons
Peanuts

ఇక చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది. ఇలా ప‌ల్లీల‌ను తినే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now