Kidneys Clean : కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా శుభ్రం చేసే సహజ సిద్ధమైన ఔషధ పానీయం..!

April 11, 2023 12:29 PM

Kidneys Clean : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంటుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో కత్తిరించిన ఆకులను వేసి నానబెట్టాలి. కొంత సేపటి తరువాత వాటిని అదే నీటితో స్టవ్‌పై 10 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం స్టవ్ నించి దింపిన పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి. ద్రవం చల్లారాక దాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. మోతాదుకి ఒక గ్లాస్ చొప్పున నెలకు రెండు సార్లు ఈ పానీయాన్ని సేవించాలి. దీన్ని తీసుకున్న తరువాత వచ్చే మూత్రం రంగు మారి ఉంటుంది. అంటే మీ శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతున్నాయన్నమాట.

drink coriander leaves water for Kidneys Clean
Kidneys Clean

ఈ పానీయంతోపాటు రోజులో వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది. మహిళలకు రుతు సమయంలో కలిగే నొప్పులను తొలగించడంలో ఈ పానీయంగా బాగా పనిచేస్తుంది. అయితే కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వారు మాత్రం ఈ పానీయాన్ని తాగకూడదు. ఎందుకంటే వాటిని ఈ పానీయం మరిన్ని ఇబ్బందులు పెడుతుంది. గర్భిణీలు దీన్ని తాగాలనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now