మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనకి తెలుసు. కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన నిద్ర కూడా ఉంటుంది. మంచి నిద్రని పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర మొత్తం పోతుంది. నిద్రే పట్టదు. సరిగ్గా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే, మనం మన పనులు మనం పూర్తి చేసుకోలేము.
ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. నిద్రపోవడానికి మూడు గంటల ముందు, రాత్రి భోజనం చేసేయాలి. అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రిపూట పాలు తాగకూడదు. పాలల్లో ఉండే లాక్టోస్ ఆహారం జీర్ణ క్రియ కి ఆటంకం కలిగిస్తాయి. సరిగా నిద్ర పట్టదు. కాబట్టి పాలను తీసుకోవద్దు. అలానే, రాత్రిపూట చాక్లెట్ ని తీసుకుంటే కూడా నిద్ర పట్టదు.
కెఫిన్, చక్కెర ఇందులో ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని ఉత్సాహం లేకుండా బాధపడేలా చేస్తాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అదేవిధంగా, రాత్రిపూట పిజ్జా తీసుకోకూడదు. రాత్రివేళ పిజ్జా తీసుకోవడం వలన ఎక్కువ క్యాలరీలు అంది. ట్రాన్స్ ఫ్యాట్స్ పొట్టలో ఎక్కువసేపు ఉండిపోతాయి. కాబట్టి, రాత్రి అసలు మంచి నిద్ర పట్టదు. రాత్రిపూట పండ్ల రసం తీసుకోవద్దు. రాత్రిపూట ఒక గ్లాసు జ్యూస్ తాగే అలవాటు ఉంటే, దానిని మానుకోండి.
ఛాతి లో మంట కలుగుతుంది. నిద్రకి ఆటంకం కలుగుతుంది. అలానే, రాత్రిపూట సోడా, మద్యం కూడా తీసుకోవద్దు. ఇవి కూడా నిద్రకి ఆటంకం కలిగిస్తాయి. అదేవిధంగా రాత్రిపూట టమాటో సాస్ ని కూడా తీసుకోవద్దు. టమాటో సాస్ ని రాత్రిపూట తీసుకోవడం వలన సరైన నిద్ర ఉండదు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా తీసుకోకూడదు. దీన్ని తీసుకుంటే కూడా రాత్రి నిద్ర పట్టదు. కాబట్టి, ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట తీసుకోకుండా చూసుకోండి, లేదంటే నిద్ర ఉండదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…