షుగ‌ర్ ఉన్న‌వారు ఈ మూడింటినీ త‌ప్ప‌క తినాలి..!

August 28, 2023 10:50 AM

ఈరోజుల్లో చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే కచ్చితంగా ఆహారం విషయంలో కొన్ని నియమాలని పాటిస్తూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు ఆహారం విషయంలో తప్పులు చేయడం వలన మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా షుగర్ ఉన్న వాళ్ళు తప్పులు చేయకూడదు. మంచి పోషక విలువలు క‌లిగిన‌ ఆహారాన్ని తీసుకోవడం, వైద్యుని సలహా తీసుకోవడం, రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి. షుగర్ ఉన్నవాళ్లు ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చ‌క్కెర శాతాన్ని కూడా కంట్రోల్‌లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశనగల‌ను తీసుకుంటే మంచిది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

diabetes patients must take these 3 types of nuts everyday

ఇవి జీర్ణ వ్య‌వ‌స్థ‌ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే చ‌క్కెర‌ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయగలవు. షుగర్ తో బాధపడే వాళ్ళు బాదం తీసుకుంటే కూడా మంచిది. బాదంలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదంతో రోకనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్ డి కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. చక్కెర ని కంట్రోల్ లో ఉంచగలవు.

బాదం ప‌ప్పులో కొవ్వులు, ప్రోటీన్, పీచు షుగర్ ని కంట్రోల్ లో ఉంచగలవు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వాల్ న‌ట్స్ ని తినడం కూడా మంచిది. వాల్ న‌ట్స్ లో పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరగడానికి వీలు లేకుండా, వాల్ న‌ట్స్ చేస్తాయి. చక్కెరని కంట్రోల్‌లో ఉంచగలవు. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. వాల్ న‌ట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ మూడింటినీ కూడా కచ్చితంగా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది. అప్పుడు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment