Cross Legged Position : కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడ‌దా..? కూర్చుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

March 7, 2023 12:40 PM

Cross Legged Position : ఎవ‌రైనా ప‌డుకునే భంగిమ‌లు వేరేగా ఉన్న‌ట్టే కూర్చునే భంగిమ‌లు కూడా వేరే ఉంటాయి. అంటే.. ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌క‌మైన భంగిమ‌లో వారి అనుకూల‌త‌, సౌక‌ర్యాన్ని బ‌ట్టి కూర్చుంటారు. అది కుర్చీ అయినా, మంచం అయినా, వేరే ఏ ఇత‌ర ప్ర‌దేశం అయినా కూర్చునే భంగిమ‌లు ఒక్కొక్క‌రికీ వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలా మంది కూర్చునే భంగిమ ఒక‌టుంది. అదే క్రాస్ లెగ్ పొజిష‌న్‌. అంటే కాళ్ల‌ను ఒక‌దానిపై ఒక‌టి క్రాస్ గా వేసి కూర్చుంటార‌న్న‌మాట‌. అయితే ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ భంగిమ‌లో కూర్చుంటారు. ఆ మాట కొస్తే పురుషుల్లోనూ ఇలా కూర్చునేవారున్నారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఈ క్రాస్ లెగ్ పొజిష‌న్‌లో కూర్చోకూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా కూర్చుంటే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రాస్ లెగ్ పొజిష‌న్‌లో కూర్చోవ‌డం వ‌ల్ల peroneal nerve paralysis లేదా palsy అనే స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. దీని వ‌ల్ల కాళ్ల‌లో ఉండే న‌రాల‌పై ఒత్తిడి బాగా ప‌డుతుంది. నొప్పి కలుగుతుంది. న‌రాలు శ‌క్తిని కోల్పోతాయి. క్రాస్ లెగ్ పొజిష‌న్‌లో కూర్చుంటే ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌ట‌. దీంతో బీపీ పెరుగుతుంద‌ట‌. 2010 లో ప‌లువురు సైంటిస్టులు ఈ విష‌యాన్ని నిరూపించారు కూడా. ఈ పొజిష‌న్‌లో కూర్చోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలింగా కీళ్ల నొప్పుల స‌మ‌స్య వ‌స్తుంద‌ట‌. కీళ్లు, కండ‌రాల క‌ద‌లిక‌లు స‌రిగ్గా ఉండ‌వ‌ట‌.

Cross Legged Position it is not healthy for us know what happens
Cross Legged Position

క్రాస్ లెగ్ పొజిష‌న్‌లో కూర్చోవ‌డం వ‌ల్ల spider veins అనే స‌మ‌స్య వ‌స్తుంది. ఇది వెరికోస్ వీన్స్‌కు దారి తీయ‌వ‌చ్చు. దాంతో కాళ్ల‌ల్లో ఉండే ర‌క్త నాళాలు ఉబ్బుతాయి. ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. వెన్నెముక‌, మెడ‌, తొడలు, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. శ‌రీర భంగిమ మారుతుంది. స‌రిగ్గా నిల‌బ‌డ‌లేరు, కూర్చోలేరు. అందువ‌ల్ల ఈ భంగిమ‌లో అస‌లు కూర్చోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now