Constipation : మలబద్దకమా..? ఇలా చెయ్యండి చాలు.. రోజూ మోషన్ ఫ్రీగా అయిపోతుంది..!

July 23, 2023 1:28 PM

Constipation : చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆరోగ్య నిపుణులు అద్భుతమైన చిట్కాలని చెప్పారు. వాటి గురించి ఇప్పుడు చూసేద్దాం. ఫ్రీగా మోషన్ అవ్వాలన్నా, మంచి బ్యాక్టీరియా పెరిగి మన రక్షణ వ్యవస్థని బాగా ఆరోగ్యంగా ఉంచాలన్నా ఇలా చేయాల్సిందే. మనం తీసుకున్న డైట్ లో కచ్చితంగా ఫైబర్ అధికంగా ఉండాలి. మనం డైట్ లో ఫైబర్ ని బాగా తీసుకుంటే మనకి సమస్యలు ఏమీ ఉండవు.

మ‌ల‌బ‌ద్ద‌కం సమస్య నుండి దూరంగా ఉండ‌వ‌చ్చు. కచ్చితంగా మనం తినే ఆహారంలో 30 నుండి 40 గ్రాముల వరకు పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. ఆహారంలో పీచు లేకపోతే మలబద్ధకం వంటి ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి. తొక్క తీసి కూరలు వండుకోవడం, పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకోవడం ఇలాంటి తప్పులు మనం చేస్తుండడంతో పీచు బాగా తగ్గుతోంది.

Constipation wonderful home remedy take this
Constipation

పీచు పదార్థాలు ఆహారంలో లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు కచ్చితంగా వస్తాయి. పైగా పేగుల్లో ఇమ్యూనిటీ కూడా ఈ తప్పుల వలన తగ్గిపోతుంది. మలబద్ధకం వంటి ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, తీసుకునే డైట్ లో కొర్రలు, సామలు వంటివి తీసుకుంటే పీచు పదార్థాలు బాగా అందుతాయి. 100 గ్రాముల చియా సీడ్స్ ని తీసుకుంటే 34 గ్రాముల ఫైబర్ ని పొందొచ్చు. 30 గ్రాముల వరకు చియా సీడ్స్ ని తీసుకుని గంటన్నర సేపు నీళ్లలో వేసి వదిలేయండి.

ఇలా నానబెట్టిన చియా సీడ్స్ ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. త్వరగా బయటపడిపోవచ్చు. పండ్లను ముక్కల‌ కింద కోసి వాటి మీద నానబెట్టిన చియా సీడ్స్ ని వేసుకుని తీసుకుంటే సులభంగా మలబద్ధకం సమస్య నుండి బయట పడొచ్చు. మొలకలతోపాటు కానీ కూరగాయలతో పాటు కానీ చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు. ఇలా మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటపడ‌వ‌చ్చు. చిన్నారులకి, వృద్ధులకి కూడా వీటిని పెట్టొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now