Carrot Juice In Winter : చ‌లికాలంలో క్యారెట్ జ్యూస్ ని తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

December 26, 2023 3:52 PM

Carrot Juice In Winter : శీతాకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మనం పాటించే చిన్న చిన్న పద్ధతులు, మన ఆరోగ్యాన్ని బాగా ఉండేటట్టు చేస్తాయి. మనకి శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. క్యారెట్ కూడా ఇందులో ఒకటి. క్యారెట్ రుచిగా ఉండడమే కాదు. పోషకాలతో నిండి ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. చలికాలంలో క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వలన, పలు రకాల ప్రయోజనాలని పొందవచ్చు.

చలికాలంలో క్యారట్ ని తీసుకుంటే, పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. క్యారెట్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రోజు క్యారెట్ తాగి, జ్యూస్ తాగినట్లయితే శరీరానికి కావాల్సిన ఫైబర్ లో 40 నుండి 50 శాతం వరకు మనకి అందుతుంది. ఇది జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉండడం వలన, షుగర్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువ ఉంటుంది.

Carrot Juice In Winter many wonderful health benefits
Carrot Juice In Winter

దీన్ని మానవ శరీరం విటమిన్ ఏ కిందకి మారుస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా క్యారెట్ జ్యూస్ ని తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా, క్యారెట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. అందమైన చర్మాన్ని పొందాలనుకుంటే, క్యారెట్ జ్యూస్ ని తాగడం ఉత్తమం.

చర్మ కారణాలని ఫ్రీడాడికల్స్ నుండి రక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు క్యారెట్ జ్యూస్ ని తాగడం వలన, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. క్యారెట్ లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయగలదు. ఇందులో ఉండే పొటాషియం గుండె ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లు శరీరంలోని సోడియంని బ్యాలెన్స్ చేస్తాయి. ఇలా ఇన్ని లాభాలని మనం చలికాలంలో క్యారెట్ జ్యూస్ ని తాగి పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now