Green Tea : వేస‌విలో గ్రీన్ టీని తాగ‌వ‌చ్చా.. ఏం జ‌రుగుతుంది..?

April 28, 2023 7:58 PM

Green Tea : ఇంత‌కు ముందు ప్ర‌జ‌లు త‌మ ఆరోగ్యం ప‌ట్ల అంత శ్ర‌ద్ధ చూపించేవారు కాదు. కానీ చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల బారిన కూడా ప‌డుతున్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఆరోగ్యం ప‌ట్ల స్పృహ పెరిగింది. దీంతో చాలా మంది నిత్యం వ్యాయామాలు చేయ‌డం, డైట్ పాటించ‌డం చేస్తున్నారు. అలాగే బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి చాలా మంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీంతో కొవ్వు వేగంగా క‌రుగుతుంది. అలాగే ప‌లు ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే వేస‌విలో ఈ గ్రీన్ టీని తాగ‌వ‌చ్చా.. ఏం జ‌రుగుతుంది.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వేస‌వి కాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే గ్యాస్ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. పైగా శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుంది. అయితే గ్రీన్ టీ వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో స‌హ‌జంగానే శ‌రీరం వేడిగా మారుతుంది. కానీ వేస‌వి వేడి వ‌ల్ల గ్రీన్ టీ తాగితే వేడి మ‌రింత పెరుగుతుంది. క‌నుక అతి వేడి స‌మ‌స్య ఉన్న‌వారు గ్రీన్ టీని ఈ సీజ‌న్‌లోనూ తాగ‌క‌పోవ‌డమే మంచిది. గ్రీన్ టీకి బ‌దులుగా ప్ర‌త్యామ్నాయ పానీయాల‌ను తాగాలి.

can we drink Green Tea in summer what happens
Green Tea

అయితే వేడి స‌మ‌స్య లేని వారు గ్రీన్ టీని వేస‌విలో అయినా స‌రే రోజుకు 1 క‌ప్పు మేర తాగ‌వ‌చ్చు. మోతాదుకు మించితే వేడి లేని వారికి కూడా వేడి చేస్తుంది. క‌నుక వేస‌విలో గ్రీన్ టీ తాగే విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. ఇక గ్రీన్ టీకి బ‌దులుగా స‌బ్జా గింజ‌ల పానీయం తాగ‌వ‌చ్చు. ఇది శ‌రీరానికి ఎంతో చ‌లువ చేస్తుంది. వేడి మొత్తాన్ని త‌గ్గిస్తుంది. పైగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. క‌నుక వేస‌విలో గ్రీన్ టీ క‌న్నా స‌బ్జా గింజ‌ల పానీయం ఉత్త‌మ‌మైన డ్రింక్ అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment