Bhringraj For Hair : త‌ల‌కు రోజూ ఈ నూనె వాడండి..పోయిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది.. చుండ్రు త‌గ్గుతుంది..!

September 23, 2023 8:40 AM

Bhringraj For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మార్కెట్లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాటి ద్వారా అందమైన కురులని పొందాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం సులభంగా కూడా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి భృంగరాజ్ బాగా ఉపయోగపడుతుంది.

భృంగరాజ్ నూనెని తలకి బాగా పట్టించి మసాజ్ చేయడం వలన అదిరిపోయే లాభాలని పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భృంగరాజ్ నూనెని మసాజ్ చేయడం వలన ఎలాంటి లాభాల‌ని పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. రెగ్యులర్ గా తలకి ఈ నూనెను పట్టించడం వలన చుండ్రు బాధలు ఉండవు. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు. నూనెని తలకి రాయడం వలన రిలాక్సింగ్ గా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ కూడా తగ్గుతుంది.

Bhringraj For Hair use regularly for dandruff and hair growth
Bhringraj For Hair

భృంగరాజ్ నూనెని మసాజ్ చేయడం వలన ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా పెరుగుతుంది. జుట్టు ఎదుగుదలని ఇది ప్రోత్సహిస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. పురాతన కాలం నుండి భృంగరాజ్ కి ప్రత్యేక స్థానం ఉంది. భృంగరాజ్ నూనెలో వివిధ రకాల మూలికలు ఉంటాయి. వాటిలో చక్కటి పోషకాలు, మినరల్స్ ఉండడం వలన ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది.

దానితో కొత్త జుట్టు మొలుస్తుంది. రెగ్యులర్ గా భృంగరాజ్ ని వాడడం వలన జుట్టు పెరుగుద‌ల‌ బాగుంటుంది. జుట్టుకి మంచి రంగుని కూడా ఇస్తుంది. దురద వంటి సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. భృంగరాజ్ ని తలకి మసాజ్ చేయడం వలన జుట్టు రాల‌డం, దురద వంటివి తగ్గిపోతాయి. ఇలా భృంగరాజ్ ని తలకి మసాజ్ చేయడం వలన అనేక‌ లాభాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now