Gas Trouble : ఇదొక్క‌టి చేస్తే చాలు, గ్యాస్ ట్ర‌బుల్ పోతుంది.. మ‌ళ్లీ రాదు..!

August 15, 2023 7:49 AM

Gas Trouble : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అయితే మనం మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది. మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ పొరపాట్లని చేయకండి. సాధారణంగా గ్యాస్ ఉత్ప‌త్తి అవుతుంది. అయితే గ్యాస్ పై నుండి కానీ కింద నుండి కానీ వెళ్ళకుండా ఇబ్బంది కలిగిస్తే దానిని గ్యాస్ ట్రబుల్ అని అంటారు.

పొట్ట టైట్ గా ఉబ్బినట్టుగా ఉన్నట్లయితే అది గ్యాస్ ట్రబుల్ అని చెప్పొచ్చు. పైగా నొప్పి కూడా తీవ్రంగా వస్తూ ఉంటుంది. కింద నుండి పై నుండి గ్యాస్ వెళ్ళిపోవడం అనేది ట్రబుల్ కాదు. ఆగిపోవడం అనేది ట్రబుల్. సాధారణంగా, ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే, మోషన్ అవ్వకపోవడం వలన గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమస్య ఉండకుండా ఉండాలంటే, ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఒక‌టిన్న‌ర లీట‌ర్ల‌ వరకు గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే లేవగానే తీసుకోండి. ఒక్కసారే మీరు నీళ్లని మొత్తం తీసుకోలేకపోతే, ఆగి ఆగి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండండి.

best remedy for gas trouble do like this
Gas Trouble

నీళ్లు తాగిన తర్వాత మోషన్ అవ్వాలని ధ్యాస పెట్టాలి. నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలు వంటివి తీసుకోవద్దు. కేవలం నీళ్లు తాగి మోషన్ మీద ధ్యాస పెట్టండి. కొంచెం సేపు ధ్యానం చేసుకున్నా పర్వాలేదు. మోషన్ అయిన తర్వాత మళ్లీ లీటరున్నర వరకు నీళ్లు తాగండి. ఒకవేళ కనుక తాగగలిగితే ఇంకా ఎక్కువ నీళ్లు తాగొచ్చు. అప్పుడు మొత్తం పేగుల్లోపల కూడా క్లీన్ అయిపోతుంది.

తినేటప్పుడు బాగా నమిలి తినడం వలన త్వరగా జీర్ణం స‌రిగ్గా అవుతుంది. ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక ఆహారం తీసుకోవడం వలన తిన్నది స‌రిగ్గా జీర్ణం కాదు. కాబట్టి ఇలా తీసుకోవద్దు. టైం టు టైం తీసుకోండి. ఉదయం పూట పండ్లను తీసుకోండి. అలానే ఆహారాన్ని తినేటప్పుడు, నీళ్లు తాగకండి. భోజనం చేసిన రెండు గంటల వరకు నీళ్లు తాగకుండా రెండు గంటల తర్వాత నీళ్లు తీసుకోండి. ఇలా ఈ మార్పులు చేస్తే, కచ్చితంగా గ్యాస్ ట్రబుల్ నుండి బయటపడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment